1933 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు ఆదరణ లభిస్తూ… ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. మొదట నాటకాలకు… అపరిమితమైన ప్రజా ధారణ ఉండేది. అనంతరం సినిమాలకు మెల్లమెల్లగా ప్రేక్షకులు అలవాటైపోయారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు హీరోఇజం తో హిట్ అయ్యాయి. ఆ సినిమాలంటో ఇప్పుడు చూద్దాం.
READ ALSO : భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలి..!
Advertisement
అంకుశం
టాలీవుడ్ హీరో రాజశేఖర్ పోలీస్ పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కాకుండా… పోలీస్ డిపార్ట్మెంట్ పని విధానాన్ని.. రాజశేఖర్ పాత్రను ఓ రేంజ్ కు తీసుకుపోయింది.
శివ
శివ… ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాకు సంబంధించి ఏ విభాగం తీసుకున్నా సరే అందులో ట్రెండ్ సెట్టర్గా నిలిచే మూవీ శివ. ఈ సినిమాలో నాగార్జున పాత్ర వన్ మ్యాన్ షో నడుస్తుంది.
గ్యాంగ్ లీడర్
గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఒక మిడిల్ క్లాస్ కుటుంబం కోసం మెగాస్టార్ చిరంజీవి చేసే.. పనులను ఈ సినిమాలో చూపించారు.
పెద రాయుడు
పెదరాయుడు సినిమాతో మోహన్ బాబు క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. తీర్పు చెప్పే పెద్ద మనిషిగా… కుటుంబ పెద్దగా… మోహన్ బాబు ఈ సినిమాలో బాగా యాక్టింగ్ చేశారు.
Advertisement
నిన్నే పెళ్ళాడుతా
ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇందులో నాగార్జున మరియు టబుల షో నడుస్తుంది.
సమరసింహారెడ్డి
సమరసింహారెడ్డి సినిమాలో ఫ్యాక్షనిస్టు పాత్రలో బాలయ్య నటించారు. అప్పటివరకు ఫ్యాక్షనిస్టు పాత్రలో ఏ హీరో నటించలేదు. కానీ బాలయ్య నటించిన మంచి విజయాన్ని అందుకున్నాడు.
తమ్ముడు
తమ్ముడు సినిమాతో పవన్ కళ్యాణ్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో లవర్ బాయ్ గా అలాగే బాక్సర్ గా పవన్ కళ్యాణ్ ఇరగదీశాడు.
ఇడియట్
ఇడియట్ సినిమాతో రవితేజ కెరీర్ ఆ రేంజ్ కు వెళ్ళింది. మాస్ హీరోగా… ఇడియట్ సినిమాతో రవితేజ నిరుపిoచుకున్నాడు.
సింహాద్రి
ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ సింహాద్రి. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కు మంచి విజయాన్ని అందించింది.
పోకిరి
పోకిరి సినిమా మహేష్ బాబు కెరీర్ ను ఎక్కడికో తీసుకువెళ్లింది. ఈ సినిమాలో ఓ పోకిరిలా అలాగే పోలీస్ ఆఫీసర్గా మహేష్ బాబు దుమ్ము లేపాడు.
ఢీ
మంచు విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ ఢీ. ఈ సినిమాలో మంచి కామెడీనీ పండించాడు మంచి విష్ణు.
READ ALSO : AP Govt Jobs 2023 : ఏపీలో 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ… పూర్తి వివరాలు ఇవే..!