Home » తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త… విద్యుత్ శాఖలో 1600ల పోస్టుల భర్తీ

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త… విద్యుత్ శాఖలో 1600ల పోస్టుల భర్తీ

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కార్. తెలంగాణలో టీఎస్పీఎస్సీ ద్వారా డిసెంబర్ కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా  తెలంగాణలోని నిరుద్యోగులకు టీఎస్ఎస్పీడీసీఎల్ శుభవార్త చెప్పింది.

Advertisement

భారీగా కొలువుల భర్తీకి తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,601 పోస్టుల భర్తీకి ప్రాసెస్ మొదలుపెట్టింది. ఇందులో 1,553 జూనియర్ లైన్మెన్ పోస్టులు కాగా, మిగతా 48 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయి. నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలతో ఈ నెల 15న పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు టిఎస్ఎస్పిడిసిఎల్ వెల్లడించింది. జేఎల్ఎం పోస్టులకు పదో తరగతితో పాటు ఐటిఐ, ఇంటర్ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఈ పోస్టులకు రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Advertisement

దీంతోపాటు పోల్ క్లెయింబింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపికైన అభ్యర్థుల వేతన శ్రేణి రూ. 24,340 నుంచి రూ. 39,405గా ఉంటుంది. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి విషయానికి వస్తే 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.ఈ పోస్టుల వేతనశ్రేణి రూ. 64,295-రూ.99,345 గా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

READ ALSO : రెబల్, మిరపకాయ్ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Visitors Are Also Reading