Home » భార్య భర్తలు గొడవ పెట్టుకునేటప్పుడు వీటిని మరవకండి..!

భార్య భర్తలు గొడవ పెట్టుకునేటప్పుడు వీటిని మరవకండి..!

by Azhar
Ad
ప్రేమించి పెళ్లిచేసుకున్న.. పెద్ద కుదిర్చిన పెళ్లి అయిన… పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్య గొడవలు రావడం అనేది సర్వ సాధారణం. అయితే మన పెద్దలను అడిగితే గొడవలు లేని సంసారం చాలా బోరింగ్ గా ఉంటుంది అంటుంటారు. కానీ ఈ మధ్య ప్రతి చిన్న గొడవకు భార్య, భర్తలు విడాకుల వరకు వెళ్తున్నారు. కానీ అలా కాకూడదు అంటే ఏం చేయాలి… గొడవ జరుగుతున్న సమయంలో ఎలా ఉంటె సంసారం జీవితం ఆనందంగా సాగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.
మాములుగా గొడవలు జరుగుతున్నపుడు.. భార్య భర్తల అరుచుకుంటూ ఆశలు విషయాన్ని పక్కన బెట్టి పాత విషయాలను తోడుతారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే.. మీరు ఈ విషయంపై అప్పుడే గొడవ పడలేదు అంటే ఏదో కారణం ఉంటుంది కాబట్టి.
భార్య భర్తల మధ్య జరిగే గొడవలో గెలుపోటములు అనేవి చూడకూడదు. ఎందుకంటే.. ఇందులో ఒక్కరు గెలిచిన ఇద్దరు గెలిచినట్లే.. ఒక్కరు ఓడిన ఇద్దరు ఓడినట్లే.
ఇక గొడవ జరిగే సమయంలో ఒక్కరు మరొకరి మాట వినరు. ఇది ఆ గోదావ పెద్దది కావడానికి ముఖ్య కారణం. అందుకే మీ భాగస్వామి చెప్పేది విన్నండి.
ఇక మీ భాగస్వామే మీరు చెప్పకుండా తెలుసుకోవాలి అనుకోకూడదు. మీకు ఏమైనా నచ్చిన, నచ్చకపోయినా మీరే చెప్పండి. ఎందుకంటే అమ్మ కూడా అడగందే అన్నం పెట్టదు అంటారు కదా..!
ఈ గొడవ సమయంలో ఒక్కరు మరొకరి పై మాటలు వదిలిపెడతారు. అలా చేయడం వాళ్ళ కోపం పెరుగుతుంది తప్ప.. తగ్గదు. కాబట్టి ఒక్కరినొకరు ఎప్పుడు గౌరవించుకోవాలి.
అయితే ఈ గొడవ సమయంలో అవతలి వ్యక్తి మన మాటలు పట్టించుకోవడం లేదు అనుకుంటారు. కాబట్టి మీ పార్ట్నర్ చెప్పినదాని మళ్ళీ చెప్పి.. ఇదేనా నువ్వు అంటుంది అని కన్నుకోండి.! అప్పుడు అవతలి వారికీ మీరు వారి మాటలు వింటున్నారు అని తెలుస్తుంది. అలాగే వారు చెప్పే దానిలో నిజం ఉంది అనిపిస్తే.. ఒప్పుకోండి.
ఇక ముఖ్యంగా చేయాల్సింది… గొడవ జరుగుతున్నప్పుడు.. ఒక్కరు అక్కడి నుండి కాసేపు బయటికి వెళ్లిపోవడం మంచింది. అలాగే గొడవ తగ్గిన తర్వాత ఎడమొఖం.. పెడమొఖం లా ఉండకుండా.. కాసేపు కలిసి గడిపితే ఏ సమస్య ఉండదు.
ఇది కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading