Home » యాషెస్ సిరీస్ : 139 ఏళ్ల నుంచి బుడిద కోసం పోరాటం! ఆ బుడిద ఎవ‌రిది?

యాషెస్ సిరీస్ : 139 ఏళ్ల నుంచి బుడిద కోసం పోరాటం! ఆ బుడిద ఎవ‌రిది?

by Bunty
Ad

యాషెష్ టెస్ట్ సిరీస్ అనేది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల మ‌ధ్య ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల కు ఒక సారి నిర్వహిస్తారు. ఈ సిరీస్ చ‌రిత్ర ఎంటో ఎవ‌రికి అయినా తెలుసా.. అలాగే సిరీస్ లో గెలిచిన జట్టుకు ఒక బుడిద తో ఉన్న ఒక పాత్ర ను ఇచ్చే వారు. అస‌లు ఆ బుడిద ఎవ‌రిదో తెలుసా? ఇప్పుడు మ‌నం దీని గురించి తెలుసుకుందాం. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలు 139 ఏళ్ల నుంచి బుడిద కోసం పోరాటం చేస్తున్నాయి. ఈ బుడిద ఎంటి అంటే యాషెస్ చ‌రిత్ర తెలుసుకోవాలి. అయితే 1877 నుంచి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల మ‌ధ్య టెస్ట్ మ్యాచ్ లు జ‌రుగుతూ ఉండేవి. ప్ర‌తి సారి సొంత దేశాల్లో ఆడిన జ‌ట్టే విజ‌యం సాధించేవి. 1882 ఇంగ్లాండ్ లో జ‌రిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియ విజ‌యం సాధించింది.

Advertisement

Advertisement

దీంతో ఇంగ్లాండ్ అభిమానులు బాగా హ‌ర్ట్ అయ్యారు. ఇంగ్లాండ్ క్రికెట్ చ‌నిపోయింద‌ని అంత్య‌క్రియ‌ల‌ను పూర్తి చేశామ‌ని.. బుడిద ను ఆస్ట్రేలియా తీసుకు పోయిందని ప‌లు పత్రిక ల‌లో వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఆస్ట్రేలియా తీసుకెళ్లిన బుడిద ను ఇంగ్లాండ్ తీసుకు రావాల‌ని ఫ్యాన్స్ అనే వారు. అప్పుడు ఈ మ్యాచ్ ల‌కు the quest to Regain Ashes అనే పేరుతో జ‌రిగేవి. అలా 1883 లో అస్ట్రేలియ ఓడిపోయింది. దీంతో అసిస్ అభిమానులు కొంత మంది వికెట్ల కు నిప్పు పెట్టి బుడిద చేస్తారు. ఆ బుడిద‌ను ఇంగ్లాండ్ ఆట‌గాళ్ల‌కు ఇస్తారు. అయితే 1927 నుంచి ఒరిజిన‌ల్ బుడిద ను డుబ్లికెట్ బుడిదా ను ఇంగ్లాండ్ కు వ‌చ్చింది.

అప్ప‌టి నుంచి ఈ రెండు దేశాల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ ల‌కు యాషెష్ అని అధికారికం గా పేరు వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సిరీస్ లో మొత్తం 71 మ్యాచ్ లు ఆడారు. అందులో ఆస్ట్రేలియా 33 సార్లు, ఇంగ్లాండ్ 32 సార్లు విజ‌యం సాధించింది. అలాగే ఆరు సార్లు డ్రా గా ముగిసింది. అలాగే టాప్ స్కోర‌ర్ బ్రాడ్ మెన్ 5028 ర‌న్స్ తో ఉన్నారు. అలాగే టాప్ వికెట్ టేక‌ర్ షెన్ వార్న్ 195 వికెట్ల తో ముందు ఉన్నారు.

Visitors Are Also Reading