Home » సంగీత దర్శకుడు ‘ఇళయరాజా’ వేటూరి సుందరమూర్తి గారిని అంతలా అవమానించారా ? అసలేమయ్యిందంటే ?

సంగీత దర్శకుడు ‘ఇళయరాజా’ వేటూరి సుందరమూర్తి గారిని అంతలా అవమానించారా ? అసలేమయ్యిందంటే ?

by AJAY
Ad

టాలీవుడ్ లోని లెజండ‌రీ ర‌చ‌యిత‌ల‌లో వేటూరి ఒక‌రు. ఎన్నో సూప‌ర్ హిట్ పాట‌ల‌తో వేటూరి ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేశారు. అంతే కాకుండా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోని లెజండ‌రీ సంగీత ద‌ర్శ‌కుల్లో ఇళ‌య‌రాజా ఒక‌రు. ఆయ‌న సంగీతం అంటే ప్ర‌తిఒక్క‌రూ చెవికోసుకుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతో మంది సంగీత ద‌ర్శ‌కులు వ‌చ్చినా కూడా ఇళ‌య‌రాజా సంగీతాన్ని మాత్ర‌మే ఇష్ట‌ప‌డేవారు చాలా మంది ఉన్నారు. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య తొలిప‌రిచ‌యంలోనే మ‌ర్చిపోలేని ఓ సంఘట‌న జ‌రిగింది.

Advertisement

తొలిప‌రిచ‌యంలోనే ర‌చ‌యిత వేటూరిని ఇళ‌య‌రాజా దారుణంగా అవ‌మానించార‌ట‌. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఇల‌య‌రాజా చాలా మందికి డానియ‌ల్ గా ప‌రిచ‌యం…కానీ సంగీతం పై ఉన్న ప్రేమ‌తో త‌న పేరును డానియ‌ల్ ఇళ‌య‌రాజాగా మార్చుకున్నారు. త‌మిళంలో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న ఇళ‌య‌రాజా అమావాస్య చంద్రుడు సినిమాకు స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ లో బిజీగా ఉన్న వేటూరి పాట‌లు రాయ‌గా సింగీతం శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా స‌మ‌యంలోనే వేటూరి ఇళ‌య‌రాజా ల మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది.

Advertisement

అయితే వేటూరి గురించి తెలియ‌ని ఇళ‌య‌రాజా ఆయ‌న‌ను చుల‌క‌న‌గా చూశార‌ట‌. మొద‌టిసారి వేటూరి పాట రాసి సింగీతం శ్రీనివాస్ ముందు ఇళ‌య‌రాజాకు అందించేందుకు వెళ్లార‌ట‌. కాగా ఇళ‌య‌రాజా త‌మిళ ర‌చయిత వైర‌ముత్తును మంచిన ర‌చయిత మ‌రొక‌రు లేరు అనే భావ‌న‌లో ఉండేవార‌ట‌. దాంతో వేటూరిని చూసిన వెంట‌నే ఇళ‌య‌రాజా మీరు కొంచెం ముందు వ‌చ్చి ఉంటే వైర‌ముత్తు రాసి ఇచ్చేవారు.

మీ పాట భాగోలేక‌పోయినా ఆయ‌న ఇచ్చిన దాన్ని అనువ‌దించేవారు అని కామెంట్ చేశార‌ట‌. అంతే కాకుండా వైర‌ముత్తు పావుగంట‌లో పాట రాసి ఇవ్వ‌గ‌ల‌డు అంటూ కామెంట్స్ చేశార‌ట‌. దాంతో వేటూరికి కోపం వ‌చ్చి ఒక్క నిమిషంలో ప‌ల్ల‌వి రాసిచ్చార‌ట‌. ఆ లిరిక్స్ చూసి ఇళ‌య‌రాజా కంగుతిని వేటూరి చాలా గొప్ప‌ర‌చ‌యిత అని ఒప్పుకున్నార‌ట‌.

ALSO READ: శోభన్ బాబు, కృష్ణంరాజు లతో వెంకటేష్ మల్టీ స్టారర్ లు మధ్యలోనే ఎందుకు ఆగిపోయాయి…? అసలేం జరిగింది..?

Visitors Are Also Reading