Home » చంద్ర‌బాబుతో మోహ‌న్ బాబు ల మ‌ధ్య దూరం పెర‌గ‌టానికి ఆ గొడ‌వ‌లే కార‌ణ‌మా…? అస‌లేం జ‌రిగింది..?

చంద్ర‌బాబుతో మోహ‌న్ బాబు ల మ‌ధ్య దూరం పెర‌గ‌టానికి ఆ గొడ‌వ‌లే కార‌ణ‌మా…? అస‌లేం జ‌రిగింది..?

by AJAY
Ad

మంచు మోహ‌న్ బాబు ప్ర‌స్తుతం అటు సినిమాల్లో గానీ ఇటు రాజ‌కీయాల్లో గానీ క్రియాశీల‌కంగా క‌నిపించ‌డం లేదు. అంతే కాకుండా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్న మోహ‌న్ బాబుకు వైసీపీ నుండి ఎలాంటి ప‌ద‌వి అంద‌లేదు. వైఎస్ఆర్ త‌న‌కు బావ అని చెప్పుకునే మోహ‌న్ బాబు అంత‌కు ముందు టీడీపీలో ఉన్నారు. కానీ ఆ త‌ర‌వాత పార్టీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీ లో చేరారు. అయితే ఇప్పుడు ఆయ‌న వైసీపీతోనూ అంటి ముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Advertisement

అంతే కాకుండా గంతో చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేసిన మోహ‌న్ బాబు రీసెంట్ గా లాఠీ సినిమా ఫంక్ష‌న్ లో మాట్లాడుతూ త‌న‌కు చంద్ర‌బాబుతో ఎలాంటి విభేదాల్లేవ్ అంటూ మీడియా ముందు వ్యాఖ్యానించారు. దాంతో మోహ‌న్ బాబు వ్య‌వ‌హారం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌గా మారింది. ఈ విష‌యం పై సీనియ‌ర్ విశ్లేష‌కులు అడుసుమిల్లి శ్రీనివాస‌రావు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

Advertisement

ఓ విష‌యంలో మోహ‌న్ బాబు శంక‌ర్ రెడ్డి గొడ‌వ పడ్డార‌ని శ్రీనివాస‌రావు చెప్పారు. ఆ గొడ‌వ‌లో మోహ‌న్ బాబు శంక‌ర్ రెడ్డిని కొట్టడంతో ఆ పంచాయితీ బాబు వ‌ద్ద‌కు వెళ్లింద‌ని చెప్పారు. దాంతో చంద్ర‌బాబు ఏదైనా ఉంటే మాట్లాడుకుని సెటిల్ చేసుకుని కొట్టుకోవ‌డం ఏంటి అంటూ శంక‌ర్ రెడ్డికి స‌పోర్ట్ చేశార‌ని చెప్పారు. అప్ప‌టి నుండి మోహ‌న్ బాబు చంద్ర‌బాబును ద్వేశించ‌డం మొద‌లు పెట్టార‌ని చెప్పారు. అంతే కాకుండా ఆ స‌మ‌యంలోనే జ‌గ‌న్ వంచ‌న చేరి చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు చేశార‌ని అన్నారు.

వైసీపీలో చేరినా ఎలాంటి ప్ర‌యోజనం లేకుండా పోయింద‌ని అన్నారు. విద్యాసంస్థ‌ల‌కు ఏదో ల‌బ్ది చేకూరుతుంద‌ని చేరార‌ని కానీ ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూర‌లేద‌ని అన్నారు. దాంతో ఇప్పుడు మ‌ళ్లీ ప‌క్క చూపులు చూస్తున్నార‌ని చెప్పారు. అంతే కాకుండా మోహ‌న్ బాబు చెల్ల‌ని నోటు అని ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ఒరిగేది ఏమీ లేద‌ని శ్రీనివాస‌రావు అభిప్రాయ‌ప‌డ్డారు. చంద్ర‌బాబు మోహ‌న్ బాబు ను మ‌ళ్లీ పార్టీలో క‌లుపుకుంటే అంత‌కంటే అవ‌మాన‌క‌ర‌మైన ప‌ని మ‌రొక‌టి ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

Visitors Are Also Reading