Telugu News » Blog » Feb 7th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Feb 7th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ads

అమరావతి రాజధానికే బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

Advertisement

తెలంగాణ బడ్జెట్ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టారని… రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విషయాలను బీఆర్ఎస్ చెప్పుకోవాలి.. కానీ, అబద్ధాలు చెప్పటం, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించటం టార్గెట్‌గా పెట్టుకున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.


తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తలకు సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 71,496 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,098 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

హైదారాబాద్ వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు కారు నడిపారు.

Advertisement

సీఎం జగన్ అధ్యక్షతన ఉ.11 గంటలకు SIPB సమావేశం జరగనుంది. పలు ప్రాజెక్టులకు sibp ఆమోదం తెలపనుంది. వచ్చే నెలలో జరిగే విశాఖ ఇండస్ట్రియల్ సమ్మిట్‌పై చర్చ జరగనుంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతుంది. సంగారెడ్డి జిల్లాలో 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. సిద్ధిపేట జిల్లాలో 12.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వగా… మెదక్ జిల్లాలో 13.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

బోరుగడ్డ అనిల్‌కుమార్ ఆఫీస్‌కు నిప్పు పెట్టారు. గుంటూరు డొంకరోడ్డులోని అనిల్ ఆఫీస్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఇటీవలే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై ఘాటు అనిల్ వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,440 గా ఉంది.