Home » Feb 6th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Feb 6th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

అసెంబ్లీలో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టారు. 2023-24 ఏడాదికి రూ.2,90,395 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని…. తెలంగాణ మోడల్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు.

Advertisement

ఢిల్లీలో విపక్ష నేతల సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో భేటీ నేతలు భేటీ అయ్యారు. సమావేశానికి బీఆర్ఎస్, ఆప్ సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. అదానీ షేర్ల పతనం… హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో చర్చకు పట్టుబట్టాలని నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

టర్కీలో నుర్దగికి 23 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం నమోదయ్యింది. టర్కీ, సిరియాలో భూకంపం రాగా దాదాపు 100 మంది చనిపోయారు. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.8గా నమోదు కాగా భూప్రకంపనలతో టర్కీ, సిరియాలో భవనాలు కూలిపోయాయి. సిరియాలో 42 మంది, టర్కీలో 53 మంది చనిపోయారు.

Advertisement

అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ చీఫ్ ఇంత పెద్ద ఖార్గే అన్నారు. సమస్యపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుందాని… అదానీ వ్యవహారంపై ప్రధాని మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు.

భారత్‌కు చెందిన రిక్కీ కేజ్‌కు గ్రామీ అవార్డు లభించింది. మూడోసారి గ్రామీ అవార్డు రిక్కీ కేజ్ దకించుకోడం విశేషం.

modi

ఇవాళ కర్ణాటకలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. తుమకూరులో హెలికాప్టర్ ఫ్యాక్టరీని మోడీ ప్రారంభించనున్నారు. గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రారంభించింది.

సిద్ధిపేట జిల్లా చేర్యాల సీఐ శ్రీనివాస్ సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసిన సీపీ.. పోలీస్ స్టేషన్‌లో సీఐ కోసం స్థానిక ఎమ్మెల్యే గంటన్నర వేచి చూశారు. అనుమతి లేకుండా సీఐ వేరే ప్రాంతానికి వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ కావడంతో సీఐ వ్యవహారం బయటపడింది.

నేటి నుంచి కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్రలు ప్రారంభం కానున్నాయి. పాదయాత్ర చేయనున్న పార్టీ నాయకులు.. మేడారం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది.

Visitors Are Also Reading