Telugu News » Blog » Feb 3rd 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..! by AJAY

Feb 3rd 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..! by AJAY

by AJAY

Advertisement

కేసీఆర్‌ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలకు 59,909 దరఖాస్తులు వచ్చాయి. నిన్నటితో దరఖాస్తుల గడువు ముగిసింది. అత్యధికంగా నల్గొండ జిల్లా నుండి అత్యల్పంగా ములుగు జిల్లా నుంచి దరఖాస్తులు వచ్చాయి.

కె.విశ్వనాథ్ మృతికి సంతాపంగా నేడు షూటింగ్‌ల కు బంద్ ప్రకటించారు. నేడు టాలీవుడ్ లో స్వచ్ఛందంగా షూటింగ్‌లు నిలిపివేశారు.

తిరుమలలో ఈ నెల 5 నుంచి కొత్త పరకామణి మండపంలో హుండీ లెక్కింపు జరుగుతోంది. ఆనంద నిలయం బంగారు తాపడం పనులు 6నెలలు వాయిదా వేయనున్నారు. తితిదే యాప్‌ను ప్రారంభించారు.

హైదరాబాద్‌ లోని కొత్త సెక్రటేరియట్ భవనం వెనుకభాగంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 5, 6 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. 11 ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదంపై అధికారులు ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

హైదరాబాద్‌లో నేటి నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,600 లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,470 లకు చేరింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. కొమురంభీం జిల్లా సిర్పూర్‌లో 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. నిర్మల్ జిల్లా కుంటాలలో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది.

నేడు జగనన్న మొదటి విడత విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. 213 మంది విద్యార్థులకు రూ.19.95కోట్ల సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.