Home » Feb 13th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Feb 13th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600 గా ఉండ‌గా… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.72,700 గా ఉంది.

Advertisement

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు(మం) చౌటపల్లి శివారులో క్షుద్రపూజల కలకలం రేపుతున్నాయి. గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేసేందుకు 8 మంది నిందితులు వ‌చ్చారు. నిందితుల వెంట చిన్న బాలుడు సైతం క‌నిపించ‌డంతో నరబలి ఇచ్చేందుకే బాలుడిని తెచ్చారని గ్రామస్తులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నా

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై హైకోర్టులో నేడు విచారణ జ‌రుగుతోంది. మాస్టర్‌ప్లాన్ నిర్ణయాన్ని హోల్డ్‌లో పెట్టామని తెలంగాణ ప్ర‌భుత్వం కోర్టుకు తెలిపింది. కోర్టుకు తెలపకుండా మాస్టర్‌ప్లాన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రాజ్యసభలో వంగివీటి మోహనరంగా గురించి ఎంపీ జీవీఎల్ ప్ర‌స్తావించారు. వంగవీటి మోహనరంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందిన నేత, కృష్ణా లేదా మచిలీపట్నం జిల్లాలకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.

Advertisement

ఛత్తీస్‌గఢ్ ఛోటేబెథియా ఆలంద్ అడవుల్లో భద్రతబలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ దాడుల్లో మావోయిస్టులు పరార‌య్యారు. మావోయిస్టుల‌ శిబిరాన్ని భద్రతబలగాలు ద్వంసం చేశాయి.

బాడీ షేమింగ్ చేసే ట్రోలర్స్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. నా శరీర ఛాయపై అదే పనిగా విమర్శిస్తున్నారని తమిళిసై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. నేను నల్లగా ఉన్నానంటే, అగ్గిలా మారుతానంటూ తమిళిసై వార్నింగ్ ఇచ్చారు.


తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం ప‌డుతోంది. నిన్న శ్రీవారిని 80,969 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరంపురాలోని ఫ్యాక్టరీలో మంటలు చెల‌రేగాయి. 27 ఫైరింజన్ ల‌తో సిబ్బంది మంట‌ల‌ను ఆర్పుతున్నారు.

సిక్కింలోని యుక్సోమ్‌లో తెల్లవారుజామున భూకంపం సంభ‌వించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్ర‌త‌ నమోదు అయ్యింది.

గుంటూరు పెదకాకాని ఆలయంలో మైన‌ర్ బాలికకు వివాహం చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. రసీదులు లేకుండా డబ్బులు తీసుకుని సిబ్బంది అనుమ‌తి ఇచ్చారు. దాంతో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామ‌ని ఆలయ ఈవో చెబుతున్నారు.

Visitors Are Also Reading