Home » వర్మపై సెటైర్లు… సీక్వెల్ ఎప్పుడంటున్న ఫ్యాన్స్…!

వర్మపై సెటైర్లు… సీక్వెల్ ఎప్పుడంటున్న ఫ్యాన్స్…!

by Azhar
Ad
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది వివాదాలు. కొంత మంది అయితే వర్మను వివాదాల వర్మ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన తీసే సినిమాలు అని అలానే ఉంటున్నాయి. వర్మ ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే పెద్ద పేరు సంపాదించాడు. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ పేరు అనేది వివార్ధాలోకి వెళ్ళిపోయింది. అయితే కొంత మంది వర్మ ధైర్యాన్ని మెంచ్చుకుంటే.. మరి కొందరు పిచ్చి అంటారు. అయితే వర్మ ఇప్పటికే పవన్ కళ్యాణ్ పైన.. అలాగే ఎన్టీఆర్ పైన సినిమాలు తీసి పెద్ద హాయ్ క్రియేట్ చేసాడు. కానీ అవి సక్సెస్ కాలేదు.
ఇక ఇదే రాజకీయ నాయకుల కథతో కొత్తగా వర్మ తీసిన సినిమా కొండా. కొండా మురళి, కొండా సురేఖల బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది అనేది అందరికి తెలుసు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన సమయంలో మిగితా సినిమాల మాదిరిగానే పెద్ద హాయ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ నెల 23న ఈ సినిమా ఎప్పుడైతే అభిమానుల ముందుకు వచ్చిందో… డికి కూడా అన్ని సినిమాల మాదిరిగానే ప్లాప్ అయ్యింది. వర్మ హత సినిమాలకు వచ్చినంత కలెక్షన్ కూడా ఏ ఈసినిమాకు రాలేదు.. కొందరైతే కొండా అనుచరులు కూడా ఈ సినిమా చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్మ చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ కు గురవుతున్నాయి. ఈ ఫంక్షన్ లో కొండా సినిమా సీక్వెల్ గురించి వర్మ మాట్లాడాడు. కానీ ఇప్పుడు వచ్చిన సినిమానే దారుణంగా విఫలం కావడంతో… ఎటకారంగా కొండా సీక్వెల్ ఎప్పుడు అంటూ వర్మను ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎన్నో అంచనాల మధ్య సినిమాకు వెళ్తే వర్మ మళ్ళీ నిరాశపరిచాడు అని అంటున్నారు. అయితే వచ్చిన నాలుగు రోజులోనే దాదాపుగా థియేటర్ల నుండి వెళ్లిపోయిన కొండా సినిమా.. ఇంకో వారం రోజులోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. మరి వర్మ ఈ సినిమాకు సీక్వెల్ తీస్తాడా.. లేదా అనేది చూడాలి.

Advertisement

Visitors Are Also Reading