సెంచూరియన్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ 5 పరుగులకే భారత కెప్టెన్‌ను అవుట్ చేయడంతో రోహిత్ శర్మ ప్రపంచ కప్ 2023 ఫైనల్ తర్వాత తన మొదటి అంతర్జాతీయ ఔటింగ్‌లో బ్యాట్‌తో విఫలమయ్యాడు. ఐదవ ఓవర్లో రోహిత్ పెవిలియన్ చేరాడు. అప్పటి వరకు, దక్షిణాఫ్రికా కొద్దిగా షార్ట్ బౌలింగ్ చేయడం ద్వారా బంతుల్ని వృధా చేస్తూ వచ్చింది. శుభ్ మాన్ గిల్ కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. వైట్ బాల్ క్రికెట్ లో తన సత్తా చాటుకున్న గిల్ టెస్టులో మాత్రం విఫలం అయ్యాడు.
Advertisement
Advertisement
దక్షిణాఫ్రికా టూర్ లో ఉన్న ఇండియన్ జట్టు నిన్నటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభించింది. ఈ సిరీస్ కోసం ప్రపంచ కప్ పూర్తయ్యాక విరామానికి వెళ్లిన స్టార్ ఆటగాళ్లంతా తిరిగి వచ్చారు. వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శనను ఇచ్చాడు. 14 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. కగిసో రబాడ వేసిన బౌలింగ్ లో మొదట ఇబ్బంది ఎదుర్కొన్నాడు. అతని బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు.
తక్కువ స్కోర్ కె పెవిలియన్ బాట పట్టడంతో రోహిత్ శర్మపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇదేమి ఆటతీరు అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా దక్షిణాఫ్రికా గడ్డపై ఆడినప్పుడు రోహిత్ ఫ్లాప్ అయ్యాడు. ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కనిపించినట్లు ఐయ్యింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో రబాడ రోహిత్ శర్మని ఓడించడం ఇది పదిహేనవ సారి. అసలు దక్షిణాఫ్రికా గడ్డ మీద రోహిత్ ఒక్క సారి కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు.