Home » చైతూ చేసిన పనికి ఆ జంట ఫిదా…అక్కినేని వారసుడు ఇంత మంచివాడా..!

చైతూ చేసిన పనికి ఆ జంట ఫిదా…అక్కినేని వారసుడు ఇంత మంచివాడా..!

by AJAY
Ad

సాధారణంగా సెలబ్రిటీలను సెల్ఫీ కావాలని కోరితే చాలామంది పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. వాళ్లకి ఉన్న బిజీ షెడ్యూల్స్ ఇతర కారణాల వల్ల అభిమానులు పిలిచినా ఫోటో కావాలని అడిగినా చూసీ చూడనట్టు వెళ్ళిపోతారు. కానీ కొంత మంది సెలబ్రిటీలు మాత్రం వచ్చి సెల్ఫీ అడగ్గానే వెంటనే చేస్తారు. అలాంటి వారిలో నాగచైతన్య కూడా ఒకరు అని తాజాగా జరిగిన ఒక సంఘటన తెలుపుతోంది. రీసెంట్ గా నాగచైతన్య గోవాకు వెళ్లారు. అక్కడ నవీన్ శాస్త్రి అనే అభిమాని తన భార్యతో కలిసి ఓ రెస్టారెంట్ లో నాగచైతన్యను చూశారు.

Nagachaitanya

Nagachaitanya

ముందుగా అతడు నాగచైతన్యనేనా కాదా అన్న అనుమానం ఇద్దరిలో మొదలైంది. కానీ కొద్దిసేపటికి అతడు చైతన్య నే అని కన్ఫర్మ్ చేసుకుని నేరుగా దగ్గరికి వెళ్లి మాట్లాడారట. అంతేకాకుండా తమకు ఒక సెల్ఫీ కావాలి అని చెప్పారట. ఆ తర్వాత ఇద్దరూ నాగచైతన్య తో సెల్ఫీ తీసుకుంటే ఫోటో కాస్త భాగా రాలేదట దాంతో చైతు నేను తీస్తాను అప్పుడు మీరు ఇద్దరు బాగా వస్తారు అంటూ తన చేతితో సెల్ఫీ తీసుకుని ఇచ్చాడట. ఈ విషయాన్ని నవీన్ శాస్త్రి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

Advertisement

Advertisement

 

నాగ చైతన్య డౌన్ టూ ఎర్త్ ఆయన హుందాతనానికి నిదర్శనం అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్లు సైతం చైతూ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య చివరగా లవ్ స్టోరీ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. శేకర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం చైతూ నాగార్జున హీరోగా నటిస్తున్న బంగార్రాజు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

https://www.instagram.com/p/CX-MHN9o9f-/?utm_medium=copy_link

Visitors Are Also Reading