Home » ప్ర‌ముఖ న‌టుడు జిమ్మీ వాంగ్ యు క‌న్నుమూత

ప్ర‌ముఖ న‌టుడు జిమ్మీ వాంగ్ యు క‌న్నుమూత

by Anji
Ad

ప్ర‌ముఖ తైవాన్ న‌టుడు జిమ్మీ వాంగ్ యు క‌న్ను మూసారు. ఈ విష‌యాన్ని న‌టుడు జాకీచాన్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఇది షాకింగ్ అని.. మ‌రొక మార్ష‌ల్ ఆర్ట్స్ హీరో మ‌న‌ల్ని వీడాడు. కుంగ్ ఫూ సినిమాల‌కు మీరందించిన స‌హ‌కారం, యువ‌త‌రాల‌కు ప‌లికిన మ‌ద్ద‌తు, అంద‌జేసిన జ్క్షానం ప‌రిశ్ర‌మ‌లో ఎల్ల‌ప్పుడూ గుర్తుండిపోతాయి. మీ సినిమాలు అభిమానుల హృద‌యాల్లో ఎప్పుడూ నిలిచి ఉంటాయ‌ని.. మేము నిన్ను మ‌రిచి పోలేమ‌న్నారు. జిమ్మి వాంగ్ వ‌య‌స్సు 79 సంవ‌త్స‌రాలు. షాంఘైలో జ‌న్మించి తైవాన్‌లో స్థిర‌ప‌డిన వాంగ్ తైపీలో క‌న్నుమూసారు.

Advertisement

Advertisement

రెండు ద‌శాబ్దాల పాటు 70 కి పైగా సినిమాల్లో న‌టించిన జిమ్మీ వాంగ్ మార్ష‌ల్ ఆర్ట్స్ సినిమాల్లో త‌న‌దైన ముద్ర వేశారు. న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత యాక్ష‌న్ డైరెక్ట‌ర్ స్క్రీన్ రైట‌ర్‌గా ప‌ని చేసిన జిమ్మీ వాంగ్ కుమార్తె లిండా వాంగ్ కూడా న‌టి. గాయ‌కురాలు కావ‌డం విశేషం. న‌టుడు కాక ముందు నేష‌న‌ల్ రివ‌ల్యూష‌న‌రీ ఆర్మీలో ప‌ని చేసిన వాంగ్ త‌న సీనియ‌ర్ న‌టి జిన్నెటి లిన్ చుయ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయ‌న‌కు ముగ్గురు కుమార్తెలు క‌ల‌రు.

Visitors Are Also Reading