Home » ఆ స్టార్ హీరో సతీమణి పేరుతో ఫేక్ అకౌంట్

ఆ స్టార్ హీరో సతీమణి పేరుతో ఫేక్ అకౌంట్

by Anji
Ad

స్టార్ హీరో అజిత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అజిత్ సినిమాలు ఇక్క‌డ కూడా విడుద‌ల అయి మంచి విజ‌యాల‌ను అందుకుంటున్నాయి. ఇక అజిత్ స‌తీమ‌ణి షాలిని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ప‌లు సినిమాల్లో ఈ అమ్ముడు చైల్డ్ ఆర్టీస్ట్‌గా న‌టించి మెప్పించింది. మెగాస్టార్ న‌టించిన జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సినిమ ఆలో షాలిని న‌టించింది. ఆ త‌రువాత మాధ‌వ‌న్ హీరోగా వ‌చ్చిన స‌ఖీ సినిమాలో హీరోయిన్‌గా న‌టించి ఆక‌ట్టుకుంది. అజిత్‌ను పెళ్లాడిన ఈ అమ్ముడు సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తుంది.

Advertisement

Advertisement

ఇదిలా ఉండ‌గా.. తాజాగా షాలిని పేరుతో న‌కిలీ ట్విట్ట‌ర్ అకౌంట్ ప్రత్య‌క్ష‌మైంది. ఎవ‌రో గుర్తు తెలియని వ్య‌క్తులు షాలిని పేరుతో న‌కిలీ అకౌంట్ ను కొంద‌రూ క్రియేట్ చేశారు. మిస్సెస్ షాలిని అజిత్‌కుమార్ పేరుతో క్రియేట్ చేసిన ఈ ఖాతాను అజిత్‌కుమార్ కార్యాల‌యం సిబ్బంది గుర్తించి నెటిజ‌న్ల‌ను అలెర్ట్ చేశారు. షాలినికి ఎలాంటి సోష‌ల్ మీడియా ఖాతా లేదు అని, హీరో అజిత్‌కుమార్ వ్య‌క్తిగ‌త పీఆర్ఓ స్ప‌స్టం చేశారు. ఇటీవ‌ల అజిత్‌కుమార్ కూడా త‌న‌కు ఎటువంటి సోష‌ల్ మీడియా ఖాతాలు లేవు అని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై పోలీసుల‌కు ఫిర్యాదులు చేశారు పీఆర్ఓ.

Also Read : ఉద‌య్ కిర‌ణ్‌ వదిలేసుకున్న 10 సెన్సేష‌న‌ల్ హిట్ సినిమాలు తెలుసా..?

Visitors Are Also Reading