Home » తిమ్మిర్లు వ‌చ్చిన‌ప్పుడు ఇలా చేయ‌కుంటే చాలా ప్ర‌మాదం..!

తిమ్మిర్లు వ‌చ్చిన‌ప్పుడు ఇలా చేయ‌కుంటే చాలా ప్ర‌మాదం..!

by Anji
Ad

ప్రస్తుత రోజుల్లో మనిషి ఒత్తిడి, నిద్రలేమితనం ఇంకా అలాగే ఇతర కారణాల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మన శరీరంలో జరిగే కొన్ని పరిణామాల వల్ల మనకు తెలిసిపోతుంది. అప్పుడు నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. సాధారణంగా మన శరీరంలో ఏదో ఒక భాగంలో అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తుంటాయి. ఆ భాగంలో నరాలకు మెదడు నుంచి సంకేతాల సరఫరా అవుతూ ఉంటుంది. చేతులకు తిమ్మిర్లు వచ్చాయంటే దాని అర్థం మెడ నుంచి చేతిలోకి ఆ భాగానికి వెళ్లే నరాల సరఫరా ఆగిపోతుందని అర్థం. అంటే.. ఆ నరాలు బలవంతంగా నొక్కుకుపోతే.. వాటి నుంచి సంకేతాల సరఫరా చెయ్యికి ఆగిపోతుంది.నరాలకు స్వయంగా రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

Also Read : భర్త భార్యకి ఏవిధంగా ఉంటే నచ్చుతుందో తెలుసా.. ఈ 1 తప్పకుండా తెలుసుకోండి..!!

Advertisement

నరాలపై ఒత్తిడి పడినప్పుడు.. రక్తం సరఫరా ఆగిపోతుంది. దాంతో చెయ్యికి ఆక్సీజన్, పోషకాలు అందడం నిలిచిపోతుంది. దాంతో చెతి చచ్చుబడినట్లు అవుతుంది. దాన్ని మనం ముట్టుకుంటే కూడా మనకు స్పర్శ తెలియదు. మనం నిద్ర లేచాక.. నరంపై ఒత్తిడి పోయి రక్త సరఫరా మొదలై చేతికి ఉన్న తిమ్మిర్లు పోతాయి. నడుం దగ్గర అసలైన చెయ్యికి సంబంధించిన నరం దెబ్బ తింటే కూడా తిమ్మిర్ల సమస్య వస్తుంది. దీన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. నడుం నుంచి ఈ టన్నెల్ లాంటివి వెళ్తుంది. ఇలాంటి సమస్య వల్ల తిమ్మిర్లు వస్తున్నాయని అనిపిస్తే.. వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. పదేపదే తిమ్మిర్లు వస్తుండటం, లేదా తెల్లారి లేచాక తరచూ తిమ్మిర్లు వస్తుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.

Advertisement

Also Read : పెళ్లి త‌ర్వాత కొత్త జంట‌ల‌ను ఇబ్బంది పెట్టే 6 విష‌యాలు ఇవే..!

అందుకే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంది. ఏ చిన్నపాటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు. ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర కూర్చున్నా.. భుజాల దగ్గర నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనిని థోరాసిన్ ఔట్లెట్ సిండ్రోమ్ అంటారు. కూర్చున్నప్పుడు తల ముందుకు వస్తూ ఉంటుంది. అప్పుడే నరాలు దెబ్బతింటాయి. అప్పుడే భుజాల ఎక్సర్ సైజులు చేయడం ద్వారా సమస్య రాకుండా నివారించవచ్చు. లేదా మధ్య మధ్యలో పనికి గ్యాప్ ఇచ్చి అటూ ఇటూ నడవాలి. ఇక అప్పటికీ తిమ్మిర్లు తరచూ వస్తూ ఉంటే వైద్యున్ని సంప్రదించడం మంచిదంటున్నారు నిపుణులు.

Also Read : Vidura Niti : ఈ మూడింటిని వ‌దిలేయ‌క‌పోతే జీవితం శాపంగా మారుతుంది

Visitors Are Also Reading