Home » మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ భార్య ఎవ‌రో తెలుసా..? మీడియాకు ఎందుకు దూరంగా ఉంటారంటే..!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ భార్య ఎవ‌రో తెలుసా..? మీడియాకు ఎందుకు దూరంగా ఉంటారంటే..!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ హీరోల‌లో కొంత‌మంది హీరోల ఫ్యామిలీ మెంబ‌ర్స్ గురించి నెటిజ‌న్ ల‌కు చాలా వ‌ర‌కు తెలుసు. కానీ కొంత‌మంది స్టార్ ల ఫ్యామిలీ మెంబ‌ర్స్ గురించి అస్స‌లు తెలియ‌దు. కాగా మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ స‌తీమ‌ణి గురించి కూడా చాలా మందికి తెలిసి ఉండ‌దు. దానికి కార‌ణం ర‌వితేజ స‌తీమ‌ణి పెద్ద‌గా సినిమా ఫంక్ష‌న్ ల‌లో క‌నిపించ‌రు. మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటారు. కాబ‌ట్టి ఆవిడ గురించి ఇప్పుడు తెలుసుకుందాం….

Advertisement

 

ర‌వితేజ భార్య పేరు క‌ళ్యాణి తేజ కాగా ఆమె చూడటానికి అచ్చం హీరోయిన్ లా ఎంతో అందంగా ఉంటారు. క‌ల్యాణి తేజ ర‌వితేజ‌కు దూర‌పు బంధువు అవుతారు. ఓ ఫంక్ష‌న్ లో క‌ల్యాణి తేజ‌ను చూసిన ర‌వితేజ త‌ల్లి త‌న కుమారిడికి భార్యగా చ‌క్క‌గా సెట్ అవుతుందని అనుకున్నారట‌. ఆ త‌ర‌వాత వెళ్లి అమ్మాయి వాళ్ల పేరెంట్స్ తో మాట్లాడి సంబంధం క‌లుపుకున్నారు.

Advertisement

ఇక 2002 సంవ‌త్స‌రంలో ఏపీలోని ఈస్ట్ గోదావ‌రిలో ర‌వితేజ వివాహం జ‌రిగింది. ఇక పెళ్లై ఇన్నేళ్లు అవుతున్నా క‌ల్యాణి తేజ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. కాబ‌ట్టి క‌ల్యాణి తేజ ఫోటోలు కూడా గూగుల్ లో త‌క్కవ‌గానే ఉంటాయి. అంతే కాకుండా వీరిద్ద‌రికీ ఓ కూతురు మ‌రియు కుమారుడు ఉన్నారు.

కాగా పిల్ల‌ల‌ను కూడా మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. కానీ క‌ల్యాణీ తేజ ర‌వితేజ స‌క్సెస్ లో భాగం అయ్యారు. ర‌వితేజ సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో పిల్ల‌ల బాధ్య‌త‌ల‌ను ఆవిడే చూసుకుంటారు. అంతే కాకుండా ర‌వితేజ బాగోగుల‌ను చూసుకుంటూ ఉంటారు.

Also Read:  Telugu News, Tollywood News in Telugu

Visitors Are Also Reading