సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఎంతోమంచి గుర్తింపు తెచ్చుకున్న అచ్యుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇతను ఇండస్ట్రీలో రాణిస్తున్న సమయంలోనే ఇతను హార్ట్ ఎటాక్ సమస్యతో మరణించినప్పటికీ ఆయన చనిపోయిన సమయంలో ఎన్నో రకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి.
అచ్యుత్ కి హార్ట్ ఎటాక్ రావడానికి గల ప్రధాన కారణం ఓ స్టార్ హీరో అని ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ‘తాజ్ మహల్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అతనికి ఎంతోమంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అచ్యుత్ నటించిన తమ్ముడు, బావగారు బాగున్నారా, తొలిప్రేమ, గోకులంలో సీత, నరసింహనాయుడు, సింహాద్రి, ఒక్కడు, వాసు, అన్వేషణ వంటి ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో అలరించారు. అలాంటి అద్భుతమైన సినిమాలలో నటించిన అచ్యుత్ అతి చిన్న వయసులోనే మరణించడం నిజంగా బాధాకరం.
అయితే అచ్యుత్ హార్ట్ ఎటాక్ కి గల కారణం ఓ స్టార్ హీరో అని… ఆ హీరో అచ్యుత్ కి చాలా మంచి స్నేహితుడుగా నటిస్తూనే కొన్ని విషయాల్లో అచ్యుత్ ని గోరంగా మోసం చేశారట. ప్రతి చిన్న విషయానికి అచ్యుత్ ను టార్గెట్ చేసి హింసించడం మొదలుపెట్టారట ఆ హీరో. ఇక అతను పెట్టే టార్చర్ భరించలేక అచ్యుత్ కి హార్ట్ ఎటాక్ వచ్చిందని అతని కుటుంబసభ్యులు, సన్నిహితులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
- World Cup 2023 : క్రికెటర్లపై పగబట్టిన దోమలు.. డెంగ్యూ బారిన మరో దిగ్గజం !
- World Cup 2023 : వివాదంలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. రద్దు చేస్తారా ?
- గ్రహణం సమయంలో గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తలివే..ఈ నెలలో రెండు గ్రహణాలు !