Home » హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాలో నాగార్జున‌కు డూప్ గా న‌టించిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా…!

హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాలో నాగార్జున‌కు డూప్ గా న‌టించిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా…!

by AJAY
Ad

సినిమాల‌లో కొన్ని సీన్లకు హీరోల‌కు డూప్ లు అవ‌స‌రం అవుతారు. అయితే డ‌బుల్ యాక్ష‌న్ సినిమాల‌లో డూప్ లు మ‌రింత ఎక్కువ అవ‌స‌రం అవుతారు. రెండు క్యారెక్ట‌ర్ లు చేయాలి కాబట్టి డూప్ అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక నాగార్జున్ కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాలోనూ డూప్ అవ‌స‌రం అయ్యార‌ట‌. ఇద్ద‌రి క్యారెక్ట‌ర్ లు చేయ‌డం నాగార్జున‌కు క‌ష్టం అవ్వ‌డంతో డూప్ కోసం వెతుకున్నార‌ట‌. అదే స‌మ‌యంలో ఓ వ్య‌క్తి అవ‌కాశాల కోసం అన్న‌పూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరుగుతున్నారు.

 

 

Advertisement

ఎత్తు పొడుగూ స‌రిపోవ‌డంతో నాగార్జున ఆ వ్య‌క్తిని ద‌ర్శ‌కుడికి ప‌రిచ‌యం చేశారు. ఆ వ్య‌క్తిని చూసిన ద‌ర్శ‌కుడు కూడా నాగార్జున‌కు స‌రిపోతార‌ని అన్నారు. అయితే నాగార్జున‌కు హలో బ్ర‌దర్ సినిమాలో డూప్ గా న‌టించిన ఆ వ్యక్తి టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయారు. ఆ వ్య‌క్తి ఎవ‌రా అని అనుకుంటున్నారా.?? మ‌రెవ‌రో కాదు హీరో శ్రీకాంతే నాగార్జున‌కు హ‌లో బ్ర‌ద‌ర్ చిత్రంలో డూప్ గా న‌టించారు.

Advertisement

srikanth

srikanth

కానీ ఈ విష‌యం చాలా మందికి తెలియదు. కానీ ఆ త‌ర‌వాత శ్రీకాంత్ కు సినిమాల‌లో అవ‌కాశాలు వ‌చ్చాయి. దాంతో మెల్లి మెల్లిగా స్టార్ హీరో స్థాయికి శ్రీకాంత్ ఎదిగారు. ఈ విష‌యాన్ని శ్రీకాంత్ అప్పుడప్పుడూ ఇంట‌ర్వ్యూల‌లో కూడా చెబుతు ఉంటారు. ఈ విష‌యం తెలిన‌వాళ్లు కూడా ఆశ్చ‌ర్య‌పోతుంటారు.

ALSO READ : టాబ్లెట్ వేసుకునేట‌ప్పుడు ఆ మంత్రం జ‌పించాలి…ఉపాస‌న హెల్త్ టిప్..!

ఏంటి శ్రీకాంత్ నాగార్జున‌కు డూప్ గా చేశారా అని……కానీ ఇది నిజం కావాలంటే మీరు కూడా శ్రీకాంత్ గ‌త ఇంట‌ర్వ్యూలు చేసినా లేదంటే గూగుల్ చేసినా క‌నిపిస్తుంది. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే శ్రీకాంత్ అఖండ సినిమాతో విల‌న్ గా కెరీర్ ను మొద‌లు పెట్టారు. ఈ సినిమాలో బ‌లయ్య‌ను ఢీ కొట్టే పాత్ర‌లో న‌టించి శ్రీకాంత్ ఆక‌ట్టుకున్నారు.

Visitors Are Also Reading