Home » F3: ట్రిబుల్ కామెడీ.. ట్రిబుల్ రెమ్యూనరేషన్..??

F3: ట్రిబుల్ కామెడీ.. ట్రిబుల్ రెమ్యూనరేషన్..??

by Sravanthi Pandrala Pandrala
Ad

యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తాజాగా తెరకెక్కిన మూవీ f3 ఈ మూవీ మరో వారం రోజులలో థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమాను ఎఫ్ 2 సీక్వెల్ గా దర్శకుడు తెరకెక్కించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొన్నది. ఇక ఈ మూవీలో భారీగా కాస్టింగ్ ఉన్న సంగతి కూడా తెలిసిందే. అయితే f2 కన్నా ఎక్కువ f3లో కామెడి డోస్ పెంచాడు డైరెక్టర్.

అయితే ఈ మూవీలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ హీరోలుగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఎఫ్ 2 మూవీ లో ఈ హీరోలు చేసే హంగామా మామూలుగా లేదు. అయితే ఇప్పుడు దానికి మించిన ఫన్ f3 లో ఉంటుందని తెలుస్తోంది. అలాగే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి సోషల్ మీడియాలో మాత్రం చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన f2 సినిమా కొరకు గతంలోనే ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారని, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో, దానికి సీక్వెల్ గా సినిమా వస్తుండడంతో నిర్మాత దిల్ రాజు,

Advertisement

Advertisement

ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదని వారు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ సందర్భంలోనే విక్టరీ వెంకటేష్ f3 మూవీ కోసం తన పారితోషికాన్ని మూడింతలు పెంచినట్లుగా, f2 కంటే f3 మూవీ త్రిబుల్ కామెడీ ఉంటుందని, అందుకే త్రిబుల్ రెమ్యూనరేషన్ పెంచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Visitors Are Also Reading