Home » F3 షూటింగ్ జర్నీ పూర్తి….నవ్వుల జర్నీ మొదలవుతుంది…!

F3 షూటింగ్ జర్నీ పూర్తి….నవ్వుల జర్నీ మొదలవుతుంది…!

by AJAY
Ad

విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ఎఫ్ 3. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. సినిమాలో వెంకటేష్ కు జంటగా తమన్నా నటిస్తోంది. కాగా వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Advertisement

ఎఫ్ 2 సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా థియేటర్లలో నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా f3 ని తెరకెక్కించారు. అయితే ఎఫ్ 2లో భార్యల వల్ల వచ్చే ప్రస్టేషన్ నేపథ్యంలో ఉండగా…ఎఫ్ 3 లో మూడు డబ్బు వల్ల వచ్చే ప్రస్టేషన్ గురించి చూపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

Advertisement

అనిల్ రావిపూడి ఓ బస్సులో చిత్రబృందం తో కూర్చుని… షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. “మా షూటింగ్ జర్నీ పూర్తయింది. మీ నవ్వుల జర్నీ మొదలవుతుంది. వస్తే కొద్దిగా ముందుగా… వెళ్ళి నా కొద్దిగా వెనకగా… థియేటర్స్ లోకి రావడం మాత్రం పక్కా.. అంటూ చిత్ర యూనిట్ ఈ వీడియోని షేర్ చేసింది.

Also Read: ఆ స్టార్ డైరెక్ట‌ర్ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడా..?

Visitors Are Also Reading