Home » ఎఫ్ 3 కలెక్షన్స్ పరంగా ఎందుకు ప్లాప్ అయ్యింది..?

ఎఫ్ 3 కలెక్షన్స్ పరంగా ఎందుకు ప్లాప్ అయ్యింది..?

by Azhar
Ad

అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తాజాగా విడుదలైన సినిమా ఎఫ్ 3. ఇందులో హీరోయిన్స్ గా తమన్నా, మెహరీన్ నటించారు. ఇక దిల్ రాజు దీనిని నిర్మించాడు. అయితే గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా ప్లాప్ అయినట్లు తెలుస్తుంది. మాములుగా హిట్ అయిన సినిమాల కలెక్షన్స్ నిర్మాతలు అనౌన్స్ చేస్తారు. కానీ ఈ సినిమా ఎంత కల్ట్ చేసింది అనేది దిల్ రాజు అనౌన్స్ చేయలేదు.

Advertisement

ఎందుకంటే… ఈ సినిమా హిట్ అని అన్న కూడా కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదంట. తగ సమాచారం ప్రకారం ఈ సినిమా పెట్టుబడులతో కేవలం 60 శాతం మాత్రమే రాబట్టిందట. దాంతో 40 శాతం నష్టపోయినట్లు తెలుస్తుంది. అయితే ఎఫ్ 2 సినిమాకు పెట్టిన దానికంటే.. ఈ సినిమాకు మూడింతలు పెట్టి నిర్మించాడు దిల్ రాజు. అందువల్ల 40 శాతం అంటే భారీ స్థాయిలో నష్టపోయినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడానికి కారణాలు ఏంటి అనేది ఆలోచిస్తే.. ఇందులో ఉన్న ఓవర్ కామెడీ అనేది చాలా మందికి నచ్చలేదు అని తెలుస్తుంది.

Advertisement

దానికి తోడుగా ఈ మధ్యే సినిమా టికెట్ రితీష్ అనేవి భారీగా పెరిగిపోయాయి. అందువల్ల ఈ సినిమాను థియేటర్లో చుడానికి అభిమానులు అంతగా ఆసక్తి చూపించలేదు అని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ సినిమాలకు అయితే ఎక్కువ టికెట్ రేట్స్ పెట్టవచ్చు.. కానీ ఈ సినిమాకు ఎందుకు అని అభిమానులు భావించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా… ఈ మధ్య విడుదలైన ప్రతి సినిమా నెల రోజులో ఓటీటీలోకి వస్తుండటంతో.. అంత ధర టికెట్ కు పెట్టి.. చూడటం కంటే.. ఓటీటీలో చూడవచ్చు అని ఫ్యాన్స్ భావించినట్లు తెలుస్తుంది. కానీ ఈ సినిమా కనీసం విడుదల తర్వాత 50 రోజుల వరకు ఓటీటీలోకి రాదు అని నిర్మాత అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐని లెక్క చెయ్యని టీం ఇండియా.. విచ్చలవిడిగా..?

ఇంగ్లాండ్ క్రికెటర్ తో సచిన్ కొడుకి ప్రేమాయణం..!

Visitors Are Also Reading