Telugu News » Blog » మ‌నీకి అంతం లేదు.. F3 ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల

మ‌నీకి అంతం లేదు.. F3 ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల

by Anji
Ads

విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ఫ్రిన్స్ వ‌రుణ్ తేజ్ మ‌ల్టీస్టార‌ర్ గా వ‌స్తున్న సినిమా ఎఫ్‌-3. 2019లో విడుద‌లైన ఎఫ్‌-2 సినిమాకు సీక్వెల్ గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్‌-3 చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. డ‌బ్బు గురించి వివ‌రించే సాంగ్‌లో విక్ట‌రీ వెంక‌టేష్ మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ మాస్ గెట‌ప్ లో అల‌రిస్తున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ అందించిన మ్యూజిక్ తో ఈ ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ మాస్ గా క‌నిపిస్తోంది.

Ads

Ads

ల‌బ్ డ‌బ్ మని సాగే ఈ మ‌నీ సాంగ్ మ‌న జీవితాల‌ను ప్ర‌భావితం చేసేవిధంగా ఉన్న‌ది. 2019లో విడుద‌లైన ఎఫ్‌-2 సినిమా కామెడీ సినిమాకు కాస్త కామెడీని యాడ్ చేసి ఎఫ్‌3ని సినిమాను అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ తో పాటు కామెడియ‌న్ సునీల్ కూడా నటిస్తున్నాడు. అదేవిధంగా ఎఫ్‌-2లో న‌టించిన హీరోయిన్లు త‌మ‌న్నా, మెహ్రీన్ ఎఫ్‌3లో కూడా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌లే చిత్రం బృందం ప్ర‌క‌టించింది. మ‌రొక వైపు ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య విడుద‌ల కానుంది.

Ad

Also Read :  IPL 2022 : అహ్మ‌దాబాద్ ఫ్రాంచైజీ పేరు ప్ర‌క‌టించిన సీవీసీ క్యాపిట‌ల్