ఎన్నికల వేళ, ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పార్టీ రాబోతోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని స్థాపించబోతున్నారని తెలుస్తోంది. గత కొంతకాలంగా విశాఖ నుంచి మాత్రమే పోటీ చేస్తానని జెడి చెబుతూ వస్తున్నారు. స్వతంత్రంగా కానీ, పార్టీ ద్వారా కానీ పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఈ పార్టీ గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నారు. అయితే ఈ పార్టీని ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ పార్టీతో కలిసి ఉండేదెవరు? అన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
Advertisement
2019 సమయంలోనే లక్ష్మి నారాయణ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే.. కొన్ని కారణాల వలన ఈ ప్రతిపాదనను ఆయన విరమించుకున్నారు. ఈ ఎన్నికల సమయంలో జనసేన నుంచి విశాఖ వద్ద పోటీ చేసిన జెడి ఓడిపోయారు. ఆ తరువాత కొన్ని రోజులకే ఆయన జనసేనని వదిలేసారు. విశాఖ కేంద్రంగా అప్పటి నుంచే పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన హై కోర్ట్ లో కేస్ వేశారు.
Advertisement
కార్మికుల నిరసనల్లో పాల్గొని తన మద్దతుని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పర్యటనలు చేస్తూ వచ్చారు. ఈ సమయంలో ఆయన కొత్త పార్టీ పెట్టడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ పార్టీని రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పార్టీలకు భిన్నంగా ఈ పార్టీ ఆశయాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ పార్టీ వలన ఏ పార్టీ ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది అన్న విషయమై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. గతంలో పవన్ తో కలిసి పని చేసిన కాపు నేతలు జనసేనని కాదని బయటకు వచ్చారని.. ఇప్పుడు లక్ష్మి నారాయణ పార్టీ పెడితే.. ఆయనకు మద్దతు తెలిపే అవకాశం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!