Home » ఆ రికార్డు రోశయ్య కే సొంతం…!

ఆ రికార్డు రోశయ్య కే సొంతం…!

by AJAY
Ad

మాజీ ముఖ్యమంత్రి రోశ‌య్య అనారోగ్యంతో క‌న్నుమూశారు. బీపీ త‌గ్గ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లిచగా ఆయ‌న అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు వెల్ల‌డించారు. రోశ‌య్య స్వాంతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా సీనియ‌ర్ రాజ‌కీయ నాయకుడిగా ప్ర‌జ‌ల‌కు ఎన్నో సేవ‌లు అందించారు. సుధీర్ఘ‌కాలం పాటూ ఆయ‌న మంత్రి మండ‌లిలో ప‌నిచేశారు. అంతే కాకుండా రోష‌య్య గ‌వ‌ర్న‌ర్ గా సైతం ప‌నిచేశారు. ఆర్థికమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు.

Advertisement

konijeti rosaiah

konijeti rosaiah

ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు. సుధీర్ఘ‌కాలం ఆర్థిక మంత్రిగా ప‌నిచేసిన రికార్డు ఆయ‌నకే సొంతం…..ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు.

Advertisement

రోశ‌య్య రాజ‌కీయ ప్ర‌స్థానం
1968-85: శాసనమండలి సభ్యుడు.
1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత.
1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు.
2009 సెప్టెంబరు – 2010 నవంబరు 24: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నరు.

read also మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రాజకీయ నేపథ్యం

Visitors Are Also Reading