Telugu News » Blog » నేను బ్రాహ్మ‌ణుడినే అయిన‌ప్ప‌టికీ మాంసం తింటా.. మందు తాగుతా.. వేణు స్వామి సంచ‌ల‌న కామెంట్లు..!

నేను బ్రాహ్మ‌ణుడినే అయిన‌ప్ప‌టికీ మాంసం తింటా.. మందు తాగుతా.. వేణు స్వామి సంచ‌ల‌న కామెంట్లు..!

by Anji
Ads

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న జ్యోతిష్యం చెప్పాడంటే చాలా వ‌ర‌కు నిజ‌మ‌వుతుంద‌ని న‌మ్ముతుంటారు. చాలా మంది సెలెబ్రిటీల విష‌యంలో ఆయ‌న చెప్పింది వాస్త‌వం అయింది. తాజాగా వేణు స్వామి సంచ‌ల‌న కామెంట్స్ చేసాడు. ముఖ్యంగా ఆయ‌న ఎప్పుడూ ఏద ఒక విషయంపై కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేస్తాడ‌నే విష‌యం తెలిసిందే. ఎక్కువ‌గా సెలెబ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కుల జాత‌కాలు చెబుతూ నెక్ట్స్ ఎవ‌రికీ ఏం జ‌రుగ‌బోతుందో ముందే చెప్పేస్తుంటాడు. ఇప్ప‌టివ‌ర‌కు చాలా మందిపై కామెంట్స్ చేసిన వేణు స్వామి తాజాగా చేసిన సంచ‌ల‌న కామెంట్స్ విని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవ‌డం విశేషం.

Ads


ముఖ్యంగా నేను బ్రాహ్ముణుడినే అయిన‌ప్ప‌టికీ నేను మాంసం తింటాను. మందు తాగుతాను అంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు వేణు స్వామి. వాస్త‌వానికి బ్రాహ్మ‌ణులు నాన్ వెజ్ తిన‌రు. మ‌ద్యం ముట్ట‌రు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ ఓ బ్రాహ్మ‌ణుడు అయి ఉండి నేను నాన్ వెజ్ తింటాను. మ‌ద్యం తాగుతా అని షాకింగ్ కామెంట్స్ చేయడం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన వేణుస్వామి పై వ్యాఖ్య‌లు చేశాడు.

Ads

ఇది కూడా చ‌ద‌వండి :  న‌దుల్లో కాయిన్స్ ఎందుకు వేస్తారో మీకు తెలుసా..?


ఒక శ‌నివారం నాడు ఎవ‌రో నాన్‌వెజ్ తెస్తే అన్నం తిన‌కుండా నాన్‌వెజ్ తిన్నా అని ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కామాక్య దేవికి ముందు తాను నాన్‌వెజ్ తినేవాడిని కాద‌ని.. ఆ త‌రువాత నాన్‌వెజ్ తిన‌డం ప్రారంభించాన‌ని వేణుస్వామి చెప్పుకొచ్చాడు. కామాక్య అమ్మ‌వారికి మ‌ట‌న్‌, ఫిష్‌, చికెన్ నైవేద్యంగా పెడ‌తార‌ని చెప్పుకొచ్చాడు వేణుస్వామి. క‌ర్ణాట‌క‌లోని చాలా దేవాల‌యాల్లో మ‌ద్యం నైవేద్యంగా పెడ‌తార‌ని.. మ‌న ద‌గ్గ‌ర తెలంగాణ‌లో అమ్మ‌వార్ల‌కు బోనాలు చేసి నాన్‌వెజ్ నైవేద్యంగా పెడ‌తార‌ని చెప్పుకొచ్చాడు. నేను తింటే త‌ప్పేంటి అని చెప్పుకొచ్చాడు వేణుస్వామి. సోష‌ల్ మీడియాలో వేణుస్వామి చేసిన వ్యాఖ్య‌ల‌ను కొంద‌రూ స‌మ‌ర్థిస్తుండ‌గా మ‌రికొంద‌రూ మాత్రం మండిప‌డుతున్నారు.

Ad

ఇది కూడా చ‌ద‌వండి :  Pushpa 2: మైండ్ బ్లోయింగ్ పాత్రలో సాయిపల్లవి.. వారి మధ్య లవ్ ఏ రేంజ్ లో అంటే..?