Home » Viral video:అమ్మ బాబోయ్ చిలుక కాదు మహానటి..దీని యాక్టింగ్ ముందు స్టార్ట్ నటులు కూడా వేస్ట్..!!

Viral video:అమ్మ బాబోయ్ చిలుక కాదు మహానటి..దీని యాక్టింగ్ ముందు స్టార్ట్ నటులు కూడా వేస్ట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అప్పుడప్పుడు కొన్ని సోషల్ మీడియా లో వీడియోలు అనుకోకుండానే వైరల్ అవుతూ ఉంటాయి. కొంతమంది వాళ్ళింట్లో పెంచుకునే కొన్ని పెంపుడు జంతువులను వీడియోలు తీసి సరదాగా వారి సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. కానీ అవి అనుకోకుండానే తీవ్రంగా వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి ఒక పెంపుడు చిలుక వీడియో కూడా వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన చాలామంది అద్భుతంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అదేంటో పూర్తిగా తెలుసుకుందాం..

also read:దాస్ కా ధమ్కీని ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం వెనుక దాగి ఉన్న కథ అదేనా ?

Advertisement

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అన్ని విషయాలను ఇతరులతో పంచుకుంటున్నారు.. వీడియోలతో, ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.. అలాంటి ఒక చిలుక వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన పెంపుడు చిలుకకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియో చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వీడియోలో చిలుక తన నటనను అద్భుతంగా ప్రదర్శిస్తుంది.

also read:డైరెక్ట‌ర్ వంశీపైడిప‌ల్లి ల‌వ్ స్టోరీకి అడ్డుప‌డిన దిల్ రాజు…ఎందుకో తెలుసా.?

ఒక డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే ఏ విధంగా నటులు వారి పర్ఫామెన్స్ ని చూపిస్తారో, ఆ విధంగానే చిలుక కూడా బొమ్మ తుపాకీ ని తన ముక్కుతో పట్టుకొని యజమాని చేతిలో పెట్టింది. అనంతరం ఆ పిస్టల్ ను చిలుక వైపు గురిపెట్టి పేల్చగానే, బుల్లెట్ల దెబ్బ తగిలి కింద పడినట్టు యాక్షన్ చేసింది. ఈ సన్నివేశాన్ని చూసిన నెటిజన్లు చిలుక యాక్షన్ కి ఫిదా అవుతున్నారు. మీరు చిలకకి ఈ విధంగా ఎలా నేర్పారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ఈ చిలుక యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

also read:

Visitors Are Also Reading