Telugu News » అలా అడ‌గ‌టం గ‌లీజ్ గా అనిపించింది..క్యాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ న‌టి ఫైర్…!

అలా అడ‌గ‌టం గ‌లీజ్ గా అనిపించింది..క్యాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ న‌టి ఫైర్…!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ లో భీమ‌వ‌రం బుల్లోడు సినిమాలో హీరోయిన్ గా న‌టించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న న‌టి ఎస్తేర్ నోరోన్హా. ఈ సినిమాలో సునీల్ హీరోయిన్ గా న‌టించి ఎస్తేర్ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. అందం అభినయంతో ఎస్తేర్ ఆక‌ట్టుకుంది. ఆ త‌ర‌వాత కొన్ని సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్ లు చేయ‌డంతో పాటూ జ‌యజాన‌కి నాయ‌క సినిమాలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కూడా చేసి ఆక‌ట్టుకుంది.

Ads

ALSO READ : ఎంఎస్ చ‌నిపోయిన త‌ర‌వాత ఆయ‌న సినిమాల‌కు డ‌బ్బింగ్ ఎవ‌రు చెప్పారో తెలుసా..?

ఇక టాలీవుడ్ లో ర్యాప‌ర్ గా న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న నోయ‌ల్ ను పెళ్లి చేసుకుని కేవ‌లం ఆరు నెల‌ల్లోనే విడాకులు తీసుకుంది. అయితే ప్ర‌స్తుతం ఎస్తేర్ క‌న్న‌డ చిత్రాల‌తో పాటూ తెలుగు సినిమాల‌లో న‌టిస్తుంది. కాగా తాజాగా తెలుగులో తాను స‌క్సెస్ అవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణాలు ఏంటో ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. భీమ‌వ‌రం బుల్లోడు సినిమా త‌ర‌వాత త‌న‌కు మ‌ళ్లీ అలాంటి సినిమాలే వ‌చ్చాయ‌ని అన్నారు.

ester noraha

ester noraha

ఆ స‌మ‌యంలో త‌ను డిగ్రీ చేస్తున్నాన‌ని ఇండ‌స్ట్రీ గురించి పెద్ద‌గా తెలియ‌ద‌ని చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్ వ‌ల్ల కూడా తాను కొన్ని సినిమాల‌కు దూరంగా ఉన్నాన‌ని చెప్పారు. తాను ఎంతో ట్రైనింగ్ తీసుకుని సినిమాల్లోకి వ‌చ్చాన‌ని..అది త‌న‌కు గ‌లీజ్ గా అనిపించింద‌ని చెప్పింది. తాను అందుకు నిరాక‌రించాన‌ని చెప్పారు. అలాంటివి త‌న‌కు న‌చ్చ‌వ‌ని త‌న‌కు యాక్టింగ్ పై ఉన్న ఆస‌క్తితోనే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాన‌ని అన్నారు.

డబ్బులు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని అవ‌కాశాలు లేక‌పోతే స్టేజిపై నాట‌కాలు కూడా వేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో మాత్ర‌మే తాను ప‌నిచేయగ‌ల‌న‌ని అన్నారు. తాను అవ‌కాశాల కోసం లొంగ‌క‌పోవ‌డంతో ఇలా ఉంటే క‌ష్టం అని చెప్పేవాళ్ల‌ని..ఎక్కువ కాలం ఇండ‌స్ట్రీలో ఉండ‌ర‌ని బెదిరింపుల‌కు కూడా పాల్ప‌డ్డార‌ని ఎస్తేర్ చెప్పుకొచ్చారు. పెద్ద స్టార్ ల కంటే చిన్నదో పెద్ద‌దో పాత్ర త‌న‌కు గుర్తింపు వ‌స్తే అందులో సంతృప్తి ఉంటుంద‌న్నారు.


You may also like