కాలం మారిన కొద్దీ ప్రేక్షకుల అభిరుచులు కూడా మారుతూ ఉంటాయి. ఒకప్పుడు సౌత్ లో బొద్దుగా ఉండే హీరోయిన్లనే ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు సైజ్ జీరో ఉండే హీరోయిన్లని ఇష్టపడుతున్నారు. దాంతో గంటల తరబడి హీరోయిన్లు జిమ్ లోనే కసరత్తులు చేస్తున్నారు. అయితే సన్నగా ఉన్న తాను అప్పట్లో సౌత్ ఇండస్ట్రీ లో ఇబ్బందులు ఎదుర్కొన్నానని నటి ఎరికా ఫెర్నాండెజ్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎరికా ఫెర్నాండెజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
అప్పట్లో సౌత్ లో హీరోయిన్ బొద్దుగా ఉంటే ఇష్టపడే వారని తాను సన్నగా ఉండే దానినని తెలిపారు. సన్నగా ఉన్న కారణంగా తన శరీరంపై ప్యాడ్స్ పెట్టి సీన్లను చిత్రించేవారని చెప్పారు. అలా ప్యాడ్ లు పెట్టి షూటింగ్ చేయడం వల్ల తనకు సిగ్గుగా అనిపించేదని ఇబ్బందిగా అనిపించేదని చెప్పారు. డైలాగ్ చెప్పే సమయంలో కూడా తను ఇబ్బంది పడినట్లు తెలిపారు. వాళ్లు కోరుకున్నట్టు నేను లేను అని చాలా సార్లు బాధపడ్డానని హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని అందరిని యాక్సెప్ట్ చేస్తున్నారని అది సంతోషకర పరిణామమని వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా ఎరికా ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో “కుచ్ రంగ్ ప్యార్ కేఐసేబీ” అనే సినిమాలో నటించింది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో అనేక చిత్రాలలో నటించింది.
ఇక సౌత్ లో తెలుగు కన్నడ తో పాటూ తమిళ భాషల్లో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో గాలిపటం అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. అంతేకాకుండా 2011లో ఫెమీనా మిస్ మహారాష్ట్ర అవార్డును దక్కించుకుంది. కానీ తెలుగు సినిమాలలో మాత్రం ఎరికా ఫెర్నాండేజ్ అనుకున్న మేర అవకాశాలు దక్కించుకోలేకపోయింది.