Home » బాలయ్య పాటలో రెచ్చిపోయిన “కల్యాణ్ రామ్”.. ఎన్నో రాత్రులోస్తాయి అంటూ !

బాలయ్య పాటలో రెచ్చిపోయిన “కల్యాణ్ రామ్”.. ఎన్నో రాత్రులోస్తాయి అంటూ !

by Bunty
Ad

గతేడాది “బింబిసార” వంటి సాలీడ్ హిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కళ్యాణ్ రామ్. మల్లిడి వశిష్టను దర్శకుడిగా పరిచయం చేస్తూ తానే నిర్మాతగా ఒక ప్రయోగాత్మక చిత్రంలో హిట్ కొట్టాడు. ఇలా ప్రయోగాలు అంటే పడిచచ్చే నందమూరి హీరో ఇప్పుడు ‘అమిగోస్’ చిత్రంలో నటిస్తున్నాడు. రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్రామ్ మూడు పాత్రల్లో కనిపించగా, అషిక రంగనాథన్ ఫిమేల్ లీడ్ గా నటించింది.

Advertisement

ఈ సినిమాను ఫిబ్రవరి 10వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి “ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదే వెన్నెలమ్మ” అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. గతంలో నందమూరి బాలయ్య చేసిన ధర్మక్షేత్రం సినిమాలోనిది ఈ సాంగ్.

Advertisement

ఇళయరాజా స్వర కల్పనలో బాలు ఆలపించిన ఆ పాట, సాంగ్స్ లో ముందు వరుసలో కనిపిస్తుంది. అలాంటి ఆ పాటను ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేయించాడు. ఎస్పీ చరణ్ మరియు సమీరా భరద్వాజ్ ఈ పాటను ఈ సినిమాలో పాడారు. కల్యాణ్ రామ్ మరియు ఆశీకా రంగనాథన్ పై ఈ పాటను అందంగా చిత్రీకరించారు. బాలకృష్ణ పాటలు, కళ్యాణ్ రామ్ రీమిక్స్ చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ‘అరే ఓ సాంబ’ సాంగ్ రీమిక్స్ చేశారు.

read also : తారక రత్న చెవిలో బాలయ్య.. మృత్యుంజయ మంత్రం చదివాడు.. అందుకే తారక్ గుండె రియాక్ట్ అయింది !

Visitors Are Also Reading