Home » ఐపీఎల్‌కు ఇంగ్లండ్ ఆట‌గాళ్లు దూరం..!

ఐపీఎల్‌కు ఇంగ్లండ్ ఆట‌గాళ్లు దూరం..!

by Anji
Ad

ఐపీఎల్-15 సీజ‌న్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుంది. మార్చి నెల చివ‌రి నుంచి ఐపీఎల్‌ను నిర్వ‌హించాల‌ని.. బీసీసీఐ క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌లోనే ఈ మెగా టోర్నీని నిర్వ‌హిస్తాం అని బీసీసీఐ చెబుతున్నా.. క‌రోనా కేసుల నేప‌థ్యంలో ద‌క్షిణాప్రికా లేదా దుబాయ్‌లో నిర్వ‌హించే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఇలాంటి త‌రుణంలో ఐపీఎల్ అభిమానుల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు ఇంగ్లండ్ ఆట‌గాళ్లు దూరం కానున్న‌ట్టు తెలుస్తున్న‌ది. దీంతో ఇంగ్లండ్ ఆట‌గాళ్ల‌ను వేలంలో ఐపీఎల్ ప్రాంచైజీలు కొనుగోలు చేస్తాయో లేదో అన్న విష‌యం ఆస‌క్తిగా మారిన‌ది.

ఐపీఎల్-15కు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూరం?

Advertisement

Advertisement

ఇప్ప‌టికే రూట్‌, బెన్ స్టోక్స్ ఐపీఎల్ వేలానికి దూరంగా ఉంటాం అని స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అయితే కొంద‌రూ ఆట‌గాళ్లు తొలి అంచె పోటీల్లో పాల్గొంటార‌ని.. ప్రచారం జ‌రుగుతోంది. న్యూజిలాండ్‌తో జ‌రిగే టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ ఆట‌గాళ్లు అందుబాట‌లో ఉండాల‌ని ఈసీబీ ఆదేశాలు జారీ చేసిన‌ది. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో రిజిస్ట‌ర్ చేసుకున్న ఇంగ్లండ్ టెస్ట్ ఆట‌గాళ్ల సంగ‌తి అయోమ‌యంలో ప‌డింది. ఈ జాబితాలో ముఖ్యంగా ఇంగ్లండ్ టెస్ట్ జ‌ట్టులో స‌భ్యులు జానీ బెయిర్ స్టో, మార్క్‌వుడ్, డేవిడ్ మ‌ల‌న్‌, ఓలీపోప్‌, క్రెయిగ్ ఓవ‌ర్ట‌న్‌, సామ్ బిల్లింగ్స్‌, డాన్ లారెన్స్ వంటి మేటీ ఆట‌గాళ్లు ఉన్నారు. వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ముందుకు వెళ్లాలంటే కీల‌క ఆట‌గాళ్లు అవ‌స‌రం అని.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తుంది. ఈ త‌రుణంలో ఐపీఎల్‌కు ఇంగ్లండ్ ఆట‌గాళ్లు దూరం కానున్నారు అని తెలుస్తోంది.

Visitors Are Also Reading