Home » కొంప ముంచిన డ్యాన్స్ .. అటు జాబ్‌, ఇటు భ‌ర్త‌ దూరం..!

కొంప ముంచిన డ్యాన్స్ .. అటు జాబ్‌, ఇటు భ‌ర్త‌ దూరం..!

by Anji

కంప్యూట‌ర్ కాలంలో వీడియోలు, ఫొటోల‌తో జీవితాలు తారుమారు అయిన ఘ‌ట‌న‌లు ఎన్నో చూసాం. తాజాగా ఒక వీడియోలో ఓ టీచ‌ర్ ప‌రిస్థితి కూడా అస్త‌వ్య‌స్తం అయింది. జీవితానికి ఆధారంగా ఉన్న టీచ‌ర్ ఉద్యోగం ఊడిపోవ‌డంతో పాటు.. మ‌రొక‌వైపు భ‌ర్త విడాకులు ఇచ్చి షాక్‌కు గురి చేశాడు.

Viral Video: Viral video of a teacher dipping his toe in a job Viral Video Effeect Egypt Teacher Sacked and Divorced Over BellyDancing | pipanews.com

వివ‌రాల్లోకి వెళ్లితే.. ఈజిప్ట్‌కు చెందిన అయా యూస‌ఫ్ టీచ‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తుంటుంది. ఆ టీచ‌ర్ త‌న స‌హా ఉద్యోగుల‌తో క‌లిసి నైలు న‌దిపై ప‌డ‌వ‌లో విహార‌యాత్ర‌కు వెళ్లింది. అక్క‌డ స‌ర‌దాగా స‌హ‌చ‌రుల‌తో క‌లిసి డ్యాన్స్ చేసింది. ఆమె చేసిన డ్యాన్స్‌ ఆమెకు ఇబ్బందులకు గురి చేసింది.

అయా డ్యాన్స్ చేస్తున్న సంద‌ర్భంలో ఆమె స‌హోద్యోగి వీడియో తీశాడు. ఆ త‌రువాత సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేసాడు. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా ఆమె చేసిన డ్యాన్స్ వైర‌ల్‌గా మారింది. ఆ డ్యాన్స్ పాఠ‌శాల అధికారుల కంట ప‌డ‌టంతో వారు సీరియ‌స్ అయ్యారు. ఏకంగా ఆమెను ఉద్యోగం నుంచి తొల‌గిస్తున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు.

ఈ షాక్ నుంచి తేరుకోక‌ముందే ఆమె భ‌ర్త మ‌రొక ఊహించ‌ని షాక్ ఇచ్చాడు. డ్యాన్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర‌మైన అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ.. విడాకులు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. నైలు న‌ది విహార‌యాత్ర‌లో ప‌ది నిమిషాల ప్ర‌యాణం త‌న జీవితాన్నే అగ‌మ్య గోచ‌ర‌మైంది అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. కొంద‌రూ నెటిజ‌న్లు ఆమె ప‌ట్ల విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. టీచ‌ర్ వ్య‌వ‌హారంలో పాఠ‌శాల అధికారులు తీసుకున్న నిర్ణ‌యంపై మ‌రికొంత మంది నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు. మ‌రొక‌వైపు ఆ డాన్స్ వీడియోను పోస్ట్ చేసిన వ్య‌క్తి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ టీచ‌ర్ డిమాండ్ చేస్తోంది.

Visitors Are Also Reading