Home » అంత‌కు ముందు అలా… ఇప్పుడిలా…

అంత‌కు ముందు అలా… ఇప్పుడిలా…

by Bunty

స్టార్ హీరోయ‌న్ల క్యూట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంటాయి. చిన్న‌నాటి ఫొటోలకు ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ఉంటుంది. హీరోయ‌న్లు ఆయ్యాక వారు ఎలా ఉంటారో అంద‌రూ చూస్తూనే ఉంటారు. కానీ, చిన్న వ‌య‌సులో ఉండ‌గా హీరోయిన్లు ఎలా ఉంటారు అన్న‌ది చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు.

స్టార్ హీరోయిన్ల చిన్న‌నాటి ఫొటోల‌కు ఫ్యాన్స్ అధికంగా ఉంటార‌నే సంగ‌తి అంద‌రికీ తెలుసు. పాపుల‌ర్ అయ్యాక స్టార్ హీరోయిన్లు వారి చిన్న‌నాటి ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి వావ్ అనిపిస్తుంటారు. ఈ ఫొటోలో క్యూట్‌గా న‌వ్వుతున్న స్మార్ట్ గ‌ర్ల్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా? లేదా… ఎవ‌రో కాదండి…తెలుగు హీరోయిన్ ఇషా రెబ్బా. తెలంగాణ‌కు చెందిన ఇషా రెబ్బా ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అంత‌కు ముందు ఆ త‌రువాత సినిమాలో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. ఈ మూవీ మంచి హిట్ కావ‌డంతో వ‌ర‌స‌గా సినిమాల్లో ఆఫ‌ర్ ల‌భించింది. హీరోయిన్ పాత్ర‌ల‌తో పాటు, సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తూ మెప్పిస్తున్న‌ది. ఎన్టీఆర్ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ చిత్రంలో న‌టించి మెప్పించింది. ఈ మూవీ మంచి హిట్ కావ‌డంతో ఆమెకు ఆఫ‌ర్లు వెల్లువ‌గా వ‌చ్చిప‌డ్డాయి. సినిమాల్లో న‌టిస్తూనే ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలో 3 రోజేస్ వ‌బ్ సీరిస్‌ను చేస్తున్న‌ది. అటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా వెబ్ సీరిస్ చేసి మెప్పించిన ఈ బ్యూటీ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్న‌ట్టు స‌మాచారం.

Visitors Are Also Reading