Home » వారానికి మూడు సార్లు చేపలు తింటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!

వారానికి మూడు సార్లు చేపలు తింటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!

by Anji
Ad

సాధారణంగా మాంసాహారంలో చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే మార్కెట్ లో దొరికే మటన్, చికెన్ కన్నా కూడా చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై పరిశోధనలు జరిపి సరికొత్త విషయాలను తెలుసుకున్నారు నిపుణులు. వారంలో అన్ని రోజులను పక్కనపెడితే ఆదివారం మాత్రం తప్పకుండా మాంసాహారం తీసుకుంటారు. కొందరు వారంలో రెండు, మూడు సార్లు కూడా నాన్ వెజ్ తీసుకుంటారు. అయితే అలాంటి వాళ్ళు నాన్ వెజ్ మెనూలోకి చేపలను చేర్చితే బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా చేపలతో గుండె జబ్బుతో పాటు కిడ్నీ వ్యాధులకు కూడా చెక్కు చెప్పవచ్చని ఓ సర్వేలో తేల్చారు.

Advertisement

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వెల్స్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన రీసెర్చ్ లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జనాభాలో చాలామంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు చేపలను వారానికి రెండు, మూడు సార్లు ఆహారంలో కలిపి తీసుకుంటే అందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెను చాలా భద్రంగా ఉంచుతాయంటున్నారు నిపుణులు.న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ తో కలిసి  పలు దేశాలకు చెందిన 25వేల మందిపై రీసెర్చ్ కూడా చేశారు. ఈ పరిశోధనలో చేపల వల్ల గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చని తేల్చేశారు.  

Advertisement

Also Read :  ఫారెన్ సీన్ లో బాలయ్యని కత్తులతో పొడుస్తుంటే పోలీసులు వచ్చి ఏం చేశారో తెలుసా ?

పసుపు, కారం, జీలకర్ర, ఉప్పు, మిర్యాల పొడి, అల్లం-వెల్లుల్లి ముద్ద, మొక్కజొన్న పిండి పొరలుగా ఉంటాయి. ప్రపంచంలోని 12 దేశాలకు చెందిన ఒకరిద్దరు కాదు..దాదాపు 25వేల మందిపై సుమారు 19 సార్లు ట్రయల్స్ చేసి మరీ చేపల వల్ల గుండె, కిడ్నీలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే  విషయాలన్నీ కనుగొన్నారు. వారంలో మూడు సార్లు చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు. ఈ చేపల ద్వారా మనిషి శరీరంలోకి కాల్షియం ,మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలతో పాటు విటమిన్-D మానవ శరీరంలోకి చేరుతుంది. దీని  ఫలితంగా కిడ్నీ వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. చేపల్లో కూడా ఆయిలీ ఫిష్ జాతికి చెందిన సాల్మన్, ట్రౌట్, టునా, స్వోర్డ్ ఫిష్, మాకరల్, సార్డెన్స్, హెర్రింగ్ వంటి చేపలు అయితే ఇంకా  మరింత మంచిదంటున్నారు.చేపల్లో ఉండే ఒమేగా-3 పాలి అసంతృప్త కొవ్వు ఆమ్లాలు మన గుండెతో పాటు కిడ్నీలకు ఎంతో మేలు చేస్తాయని తాజాగా జరిపిన పరిశోధనల ద్వారా వెల్లడి అయిందని న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. 

Also Read :   ఆ సీన్ కోసం 10 రోజులు నీళ్ల‌లో చిరంజీవి…షాకింగ్ నిజాలు బ‌య‌ట‌పెట్టిన ద‌ర్శ‌కుడు..!

Visitors Are Also Reading