Home » నేరేడు పండ్ల‌ను మీరు ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే ఈ స‌మ‌స్య‌లు రావ‌డం ప‌క్కా..!

నేరేడు పండ్ల‌ను మీరు ఎక్కువ‌గా తింటున్నారా..? అయితే ఈ స‌మ‌స్య‌లు రావ‌డం ప‌క్కా..!

by Anji
Ad

నేరేడు పండ్ల‌ను ఇండియ‌న్ బ్లాక్ బెర్రీ లేదా జామూన్ అని పిలుస్తారు. ఎండాకాలం ముగుస్తున్న త‌రుణంలో ఈ పండ్లు మార్కెట్‌లో ల‌భిస్తాయి. జావాప్ల‌మ్ అని పిలిచే ఈ పండ్లలో ఔష‌ద గుణాలు ఎక్కువ‌నే చెప్పాలి. చాలా ర‌కాల వ్యాదుల‌ను ఇవి త‌గ్గిస్తాయి. అదేవిధంగా వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉండేవిధంగా చేస్తాయి. నేరేడు పండ్లు మాత్ర‌మే కాదు. దాని ఆకులు కూడా ర‌క‌ర‌కాల వ్యాధుల‌ను త‌రుముతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లు.. ఆరోగ్యానికి కీడు చేస్తాయి.


నేరేడు పండ్ల‌తో క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలుసుకొని కాస్త రేటు ఎక్కువైనా వాటిని కొనుక్కుంటారు. అయితే ఈ పండ్లు ఆరోగ్యానికి ప్ర‌మాదక‌రం అనే విష‌యాన్ని అస్స‌లు మ‌రిచిపోవ‌ద్దు అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా నేరేడు పండు మాత్ర‌మే కాదు.. ఏ పండు అయినా ప‌రిమితికి మించి తింటే ప్ర‌మాద‌మంటున్నారు. అధికంగా తీసుకుంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని పేర్కొంటున్నారు. ఆయుర్వేదం ప్ర‌కారం.. హైబీపీ ఉన్న వారు నేరేడుపండ్ల‌ను తింటే మంచిదే అయితే ఈ పండ్లను ఎక్కువ‌గా తీసుకుంటే మాత్రం లోబీపీ స‌మ‌స్య వ‌స్తుంది. ఇక బ్ల‌డ్ ప్రెష‌ర్ ఉండాల్సిన దాని కంటే త‌క్కువ ప‌డిపోతుంది. అది ఓ స‌మస్య‌నే కాబ‌ట్టి బ్యాలెన్స్‌డ్‌గా తిన‌డం బెట‌ర్‌.

Advertisement

Advertisement


కొంత మందికి మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఉంటుంది. నేరేడు ఎక్కువ తిన‌కూడ‌దు. ఎందుకంటే వీటిలో సీ విట‌మిన్ మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య వ‌చ్చేవిధంగా చేస్తుంది. అందువ‌ల్ల చాలా జాగ్ర‌త్త ప‌డాలి. బాగున్నాయి క‌దా అని నేరేడు పండ్ల‌ను ఎక్కువ తిన‌కూడ‌దు తింటే చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయ‌ట‌. మొటిమ‌లు వచ్చే ప్ర‌మాదం ఉంటుంది. అదేవిధంగా జుట్టు రాలిపోయే స‌మ‌స్య ఎక్కువ ఉన్న వారు నేరేడు పండ్లు అతిగా తిన‌క‌పోవ‌డమే మంచిది. నేరేడు పండ్లు కొంత మందికి ప‌డ‌వు. వాటి వాస‌న చూస్తేనే వికారంగా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఈ పండ్ల‌ను తిన‌క‌పోవ‌డం మంచిది. ఇత‌రులు బ‌ల‌వంతం పెట్టినా ఆ త‌రువాత ఇబ్బంది ప‌డేది మీరే కాబట్టి తిన‌క‌పోవ‌డం మంచిది అని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read : 

మెగా అభిమానుల‌కు శుభ‌వార్త‌.. రామ్ చ‌ర‌ణ్ సినిమా టైటిల్ లాక్

 

Visitors Are Also Reading