చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడతారు. మలబద్ధకం సమస్య ఉన్నట్లయితే ఈజీగా దాని నుండి బయట పడొచ్చు. మారిన ఆహార అలవాట్లు అలానే జీవనశైలి కారణంగా చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్లు ఈ డ్రింక్స్ ని తీసుకోవాలి చామంతి టీ ని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఈ టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా మారుస్తుంది. అలానే ఇది ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. రోజు చామంతి టీ ని తీసుకుంటే మలబద్ధకం సమస్య ఉండదు.
Advertisement
Advertisement
అలానే అల్లం టీ తీసుకుంటే కూడా మంచిది. కడుపు ఉబ్బరం, వికారం, మలబద్ధకం వంటి సమస్యలు అల్లం టీ తో దూరమవుతాయి. పుదీనా టీ తీసుకుంటే కూడా మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. అజీర్తి సమస్యలు కూడా ఉండవు నిమ్మరసం తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పసుపు పాలు తీసుకుంటే కూడా మలబద్ధకం సమస్య ఉండదు. కలబంద జ్యూస్ ని ఆపిల్ సైడర్ వెనిగర్ ని కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా ఈ సమస్యను దూరం చేస్తాయి.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు వార్తల కోసం వీటిని చూడండి!