Home » ఒక్క థియేటర్లోనే 5 కోట్లు సంపాదించి.. రికార్డు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్..!!

ఒక్క థియేటర్లోనే 5 కోట్లు సంపాదించి.. రికార్డు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్..!!

Ad

తెలుగు ఇండస్ట్రీ లోనే పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న మూవీ త్రిబుల్ ఆర్.. జక్కన్న దర్శకత్వంలో స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. సినిమా రిలీజ్ అయి 50 రోజులు అవుతున్నా దీని మానియా కొనసాగుతూనే ఉంది. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రికార్డులను కొల్లగొడుతోంది..

Advertisement

ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ ఖాతాలో వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన మూడో సినిమాగా రికార్డులకెక్కింది. ప్రస్తుతం మరొక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్ నగరంలోని ఒక సింగిల్ థియేటర్లో 5 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సుదర్శన్ mm థియేటర్లో ఐదు కోట్ల రూపాయలు గ్రాస్ సాధించిన మొదటి చిత్రంగా ఈ మూవీ నిలిచింది. అంతేకాకుండా ఒక్క థియేటర్లోనే నాలుగు కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డులు బద్దలు కొట్టింది.

Advertisement

కే జి ఎఫ్ చాప్టర్ టు లాంటి మూవీ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ మూవీ మాత్రం తగ్గేది లేదంటూ వస్తుంది. ఈ మూవీని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.డివి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు.

ALSO READ;

ఎవరికైనా సాయం చేశావా నువ్వు అంటూ చిరంజీవిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కోట..?

పుచ్చకాయలో ఏది మంచిదో.. ఏది చెడ్డదో ఇలా గుర్తించండి..!

 

Visitors Are Also Reading