తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 3 నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 30 గా నిర్ణయించారు. మే 2 నుండి 4 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. 250 రూపాయల లేట్ ఫీజు తో మే ఐదు వరకు అప్లై చేసుకోవచ్చు.
Advertisement
1000 రూపాయలు లేట్ ఫీజుతో మే 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2500 లేట్ ఫీజ్ తో మే 15 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. 5000రూపాయల లేట్ ఫీజ్ తో మే 24 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. మే 21వ తేదీ నుండి ఆన్లైన్ లో ఎంసెట్ హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. మే 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.
Advertisement
మే 10, 11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలుగా నిర్ణయించారు. ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 900 ఫిక్స్ చేశారు. అయితే, ఈ సారి ఎంసెట్ పరీక్షల్లో… ఇంటర్ వెయిటేజీ లేదని విద్యాశాఖ తెలిపింది.
READ ALSO : ఆ కారణంగానే తారకరత్న డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు : కోచ్