కరోనా కారణంగా ఈసారి ఐపీఎల్ సీజన్ మహారాష్ట్రలోనే నిర్వహిస్తోంది బీసీసీఐ. అక్కడి నాలుగు మైదానాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. గత సీజన్ లో జరిగిన పొరపాట్లను ఈసారి రిపీట్ కాకుండా బీసీసీఐ జాగ్రత్త పడుతోంది. ప్రతి స్టేడియంలో ఐదు పిచ్‌లను సిద్ధం చేస్తోంది.
2021 ఐపీఎల్ రెండవ విడుత యూఏఈలో నిర్వహించారు. అక్కడి స్టేడియంలోని పిచ్‌లు తొలుత బాగానే ఉన్నప్పటికీ మ్యాచ్‌లు గడుస్తున్నా కొద్ది పూర్తిగా నెమ్మదించాయి. చివరిలో జరిగిన మ్యాచ్‌లన్నీ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాయి. ఒకే స్టేడియంలో ఎక్కువ మ్యాచ్‌లు వరుసగా నిర్వహించడం వల్ల ఈ సమస్య తలెత్తింది. అందుకే ఈసారి కొత్త ప్రణాళిక ముందుకొచ్చింది. కొన్ని మ్యాచ్‌ల తరువాత పిచ్‌లను మార్పుతూ ఉంటామని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Advertisement
Advertisement
Also Read : సినిమా కథకు ఏ మాత్రం తగ్గని రమా రాజమౌళిల ప్రేమకథ…ఎవరు ప్రపోజ్ చేశారంటే..!
మార్చి 26 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది ఫైనల్‌లో తలపడిన చెన్నై, కోల్‌కతాలు తొలి మ్యాచ్‌లో ఢీ కొట్టబోతున్నాయి. ఇప్పటికే అన్ని టీమ్‌లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి శుభఫలితాలు కలుగుతాయి