కృష్ణకుమార్ కున్నత్ అలియాస్ కేకే దాదాపు మూడు దశాబ్దాల కాలం నుంచి సినీ ప్రియుల హృదయాలను ఏలారు. ఆయన హఠాన్మరణం పొందారు. హిందీలో ఎన్నో పాటలు పాడి స్టార్ సింగర్ గా గొప్ప పేరు సంపాదించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, అస్సాం, గుజరాతి ఇలా పలు భాషల్లో ఆయన పాటలతో యువతను ఊర్రూతలూగించే విధంగా చేశాడు.
Advertisement
ఇక తెలుగులో అయితే ఆయన పాడిన ఎన్నో పాటలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కళ్లు తెరిచిన కళ్లు మూసిన కన్నె పిల్ల మీద రాసిన.. కాలేజీ స్టైలే, ఒకరికి ఒకరై ఉంటుంటే, చెలియా చెలియా.., ఏమేరా జహా, దేవుడే దిగి వచ్చినా.. దాయి దాయి దామ్మా, అవును నిజం, ఒక చిన్ని నవ్వే నవ్వి, తలచి తలచి చూసిన.. ఎవ్వరికెప్పుడు తన వలలో వంటి పాటలు కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి.
Advertisement
వాటిలో కొన్నింటిని చూసినట్టయితే గుప్పెడంత ఈ ప్రేమకు.. నీకోసమే ఈ అన్వేషణ, ఐయామ్ వెరి సారీ, ప్రేమ ప్రేమ ఓ ప్రేమ.. నీ సిగ్గుల వాకిట్లో.. శైల శైల.. నా ప్రేమను కోపంగానో, పాటకు ప్రాణం పల్లవి అయితే.. మనసంతా ముక్కలు చేశావో ఓ నేస్తం ఇలా చెప్పుకుంటూ పోతే కేకే ఆలపించిన పాటలు ఆ హీరోల కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తిండిపోయే ఆణిముత్యాలయ్యాయనే చెప్పొచ్చు. కేకే హఠాన్మరణం సినీ సంగీత లోకం మూగబోయిన వేళ.. ఆయన ఆలపించిన తెలుగు సూపర్ హిట్ సాంగ్స్‌ను మరొక సారి మనం గుర్తు చేసుకుందాం.