Home » Dussehra holidays: దసరా సెలవులు అదుర్స్.. ఎన్ని రోజులంటే..?

Dussehra holidays: దసరా సెలవులు అదుర్స్.. ఎన్ని రోజులంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలంగాణ ప్రభుత్వం స్కూల్, కాలేజీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది.. ఈ ఏడాది దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాల గాను మరియు తెలంగాణ దసరా ఉత్సవాల గానూ భారీగా సెలవులు ఇవ్వనుంది.. మొత్తం బతుకమ్మ దసరా సెలవులు కలిపి 16 రోజులు రానున్నాయి.. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల క్యాలెండర్ ప్రకారం 2022-2023 లో దసరా సెలవులకు సంబంధించి కొన్ని వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో దసరా మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. అందుకే ప్రభుత్వం స్కూల్ మరియు కాలేజీ,ఆఫీసులకు ముందుగానే సెలవు మంజూరు చేసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు స్కూల్స్ మరియు కాలేజీలకు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించాయి.

also read:ఈ ఫోటోలో ఉన్న బాలిక తెలుగులో స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఆమె నటించిన ఈ సీన్ చూస్తే ఫిదా అవుతారు..!!

Advertisement

Advertisement

మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా చూద్దాం..
ఈ సంవత్సరంలో మొత్తం పాఠశాలలు రెండు వందల ముప్పై రోజుల పనిదినాలు ఉన్నాయి. ఇందులో ఏప్రిల్ 24 2023 విద్యా సంవత్సరం చివరి రోజు అవుతోంది.. కాబట్టి వేసవి సెలవులు ఎప్పుడు 25 2023 నుంచి జూన్ 11 వరకు ఉంటాయట.. ఇందులో ప్రైమరీ స్కూల్ లకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తరగతులు కొనసాగుతాయని, ఉన్నత పాఠశాల కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 నిమిషాల వరకు తరగతులు ఉంటాయ్.

అయితే సెప్టెంబర్ 26 నుంచి మొదలు అక్టోబర్ 10వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని, వీటితోపాటుగా బతుకమ్మ దసరా పండుగ దినాలను కలిపి మొత్తం 16 రోజుల సెలవులు రానున్నాయని తెలుస్తోంది. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 28 వరకు ఉంటాయట. జనవరి 13వ తేదీ నుండి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

also read:

Visitors Are Also Reading