డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌ల విషయంలో హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయమే తీసుకున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో కేవలం రాత్రి వేళలో మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే వారు. కానీ హైదరాబాద్ పోలీసులు తీసుకున్న కీలక నిర్ణయంతో పగటి సమయంలో కూడా డ్రంక్ డ్రైవ్ టెస్ట్ చేయనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరగడంతో పాటు పలు ప్రమాదాలకు కారణమవుతున్నారు.
Advertisement
Advertisement
దీంతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, అబీడ్స్, కోఠి, చిక్కడపల్లి, అంబర్‌పేట, నారాయణగూడ, ఆర్టీసీక్రాస్‌రోడ్డు, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో ఇక నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.
మరొక వైపు కొంత మంది ఆఫీస్ కార్యాలయాలకు వెళ్లే వారు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేవలం రాత్రి వేళలో నిర్వహిస్తే బాగుంటుంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా తాగే వారు తప్పించుకుంటున్నారు. తాగకుండా కార్యాలయాలకు వెళ్లే వారికి కాస్త ఇబ్బంది అవుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.