Home » భారత్‌లో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్ టీకాకు ఆమోదం

భారత్‌లో సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్ టీకాకు ఆమోదం

by Anji
Published: Last Updated on
Ad

ఆయుధంగా నిపుణులు సూచిస్తున్నారు. దేశంలోని ప్ర‌తీ పౌరుడు కోవిడ్ వ్యాక్సిన్ ను పొందాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెప్ప‌డానికి ఇదేం కార‌ణం క‌రోనాతో జ‌రుగుతున్న ఈ యుద్ధంలో ఇప్పుడు భార‌త‌దేశం మ‌రొక వ్యాక్సిన్ శ‌క్తిని పొందింది. భార‌త‌దేశ సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ల అత్య‌వ‌స‌ర‌వినియోగాన్ని డ్ర‌ gs కంట్రోలర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. దేశంలో ఎమ‌ర్జెన్సీ కోసం ఇప్పుడు సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సుఖ్ మాండ‌వియా తెలిపారు. డీజీజీఐ ఆమోదం పొందిన స్పుత్నిక్ వి లైట్‌. దేశంలో కరోనాకు చెందిన 9వ వ్యాక్సిన్ అని ఆయన ట్వీట్ చేసారు.

Advertisement

ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ భార‌త్‌లో పంపిణీ కోసం అనుమ‌తి పొందిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది జూన్ 02వ వారం నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ సింగిల్ డోస్ ధ‌ర‌ను ఖ‌రారు చేస్తూ కీల‌క ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ క‌రోనా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తుండ‌గా.. దేశంలో క‌రోనా కేసులు భారీగా పెర‌గ‌డం, వీలైనంత త్వ‌ర‌గా అంద‌రికీ వ్యాక్నినేష‌న్ అవ‌స‌రం ఉండ‌డం కొవాగ్జిన్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం స‌రిపోక‌పోవ‌డంతో ర‌ష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వికీ అత్య‌వ‌స‌ర వినియోగం కింద కేంద్రం ఏప్రిల్ 12న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. తాజాగా స్పుత్నిక్ లైట్ కోవిడ్ వ్యాక్సిన్ కు కూడా డ్ర‌ gs కంట్రోల‌ర్ అత్య‌వ‌స‌ర వినియోగ అనుమ‌తిని మంజూరు చేసింది.

Advertisement

గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను భార‌త‌దేశంలో మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్‌కు డ్ర‌ gs కంట్రోల‌ర్ ఆఫ్ ఇండియా అనుమ‌తినిచ్చింది. స్పుత్నిక్ లైట్ ట్ర‌య‌ల్‌ను ఆమోడించ‌డానికి క‌రోనాపై స‌బ్జెక్ట్ ఎక్స్‌ఫ‌ర్ట్ క‌మిటీ సిఫార్సు చేసింది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఇచ్చిన త‌రువాత ఓ వ్య‌క్తిలో ఎటువంటి ప్ర‌మాద‌క‌ర‌మైన దుష్ప్రభావాలు క‌నిపించ‌లేదు. అత్య‌వ‌స‌ర వినియోగానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది డీజీజీఐ.

స్పుత్నిక్ వీ స్పుత్నిక్ లైట్ మ‌ధ్య వ్య‌త్యాసం స్పుత్నిక్ వీ స్పుత్నిక్ లైట్ మ‌ధ్య అతిపెద్ద వ్య‌త్యాసం మోతాదు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను రెండు సార్లుతీసుకోవాలి. అయితే స్పుత్నిక్ లైట్ ఒక మోతాదు తీసుకుంటే స‌రిపోతుంది. రెండింటి ప్ర‌భావం గురించి మాట్లాడుతూ లాన్సెట్ అధ్య‌య‌నం ప్ర‌కారం.. స్పుత్నిక్ లైట్ కంటే క‌రోనా వైర‌స్ కు వ్య‌తిరేకంగా స్పుత్నిక్‌ను వ్యాక్సిన్ మ‌రింత ప్ర‌భావ‌వంతంగా ఉంటుంది. రెండు మోతాదుల‌లో ఇవ్వ‌బ‌డిన స్పుత్నిక్ వీలో రెండు వేర్వేరు వెక్ట‌ర్‌లు ఉప‌యోగించారు.

Visitors Are Also Reading