Home » ఇండియా జట్టును తాకిన కరోనా..!

ఇండియా జట్టును తాకిన కరోనా..!

by Azhar
Ad

భారత జట్టు తాజాగా జింబాంబ్వే పర్యటన అనేది ముగించుకుంది. ఇక ఈ నెల 27 నుండి యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ లో టీం ఇండియా పాల్గొననుంది. అందుకోసం ఇప్పటికే బీసీసీఐ జట్టును కూడా ప్రకటించింది. అయితే ఈ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరైనా జింబాంబ్వే పర్యటనలో ఉంటె వారు రేపు యూఏఈకి వెళ్లి అక్కడ జట్టుతో కలుస్తారు. లేని ఆటగాళ్లు అందరూ ఈరోజు యూఏఈకి వెళ్లిపోయారు.

Advertisement

అయితే జింబాంబ్వే పర్యటనలో భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా ఉండటంతో.. అసలు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈరోజు వెళ్లిన భారత జట్టుతోనే యూఏఈకి వెళ్ళాలి. కానీ ఈ యూఏఈకి వెళ్లేముందు చేసిన కరోనా పరీక్షలు ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దాంతో భారత జట్టుకు పెద్ద షాక్ అనేది తగ్గిలినట్లే అయ్యింది. అయితే ఈ ఆసియా కప్ అనేది ప్రారంభం కావడానికి ఇంకా నాలుగు రోజులే ఉంది.

Advertisement

భారత జట్టు తమ మొదటి మ్యాచ్ పాకిస్థాన్ తో 28 అంటే ఇంకా 5 రోజుల తర్వాత ఆడాల్సి ఉంది. కానీ అప్పటి వరకు ద్రావిడ్ ఇండియా జట్టుకు అందుబాటులోకి వస్తాడా లేదా అనేది పెద్ద అనుమానం. దాదాపుగా ద్రావిడ్ ఇండియా జట్టుకు ఇంకా 10 వరకు అయిన అందుబాటులో ఉండడు. మరి అప్పటివరకు ద్రావిడ్ స్థానంలో మళ్ళీ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తాడా.. లేదా అనేది చూడాలి మరి.

ఇవి కూడా చదవండి :

ఇండియాకోసం బ్యాన్ బౌలర్..!

భారత్ VS పాకిస్థాన్ మ్యాచ్‌ ఫ్రీగా చూడండి ఇలా..!

Visitors Are Also Reading