Home » ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము.. గెలిస్తే రికార్డు ప‌క్కా..!

ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము.. గెలిస్తే రికార్డు ప‌క్కా..!

by Anji
Ad

ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్మును బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జే.పీ న‌డ్డా మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించాడు. తెలుగు అభ్య‌ర్థి, ప్ర‌స్తుత ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడుకి ద‌క్కుతుంద‌ని ఆశ ప‌డ్డా చివ‌రికి గిరిజ‌న మ‌హిళ ద్రౌప‌ది ముర్మును వ‌రించింది. ఇక ద్రౌప‌ది ముర్ము విష‌యానికొస్తే.. ఈమె ఒడిశాలోని మ‌యూర్బంజ్‌లో 1950 జూన్ 20న జ‌న్మించింది. ఈమె తండ్రి దివంగ‌త బిరంచి నారాయ‌ణ్ తుడు, భ‌ర్త దివంగ‌త శ్యామ్ చ‌ర‌ణ్. సంతానం ఇద్ద‌రు కుమారులు మ‌ర‌ణించారు. కుమార్తె ఇతి శ్రీ ముర్ము .

Advertisement

ద్రౌప‌ది భువ‌నేశ్వ‌ర్‌లోని ర‌మాదేవి ఉమెన్స్ క‌ళాశాల నుంచి బీఏ పూర్తి చేశారు. ఈమె రాయ్‌రంగ్‌లోని శ్రీ అర‌బిందో ఇంటిగ్ర‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్‌లో గౌర‌వ అసిస్టెంట్ ప్రొపెస‌ర్ గా, నీటి పారుద‌ల శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వ‌హించారు. ఇక 1997లో బీజేపీ ద్వారా క్రీయాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. 2000 సంవ‌త్స‌రం నుంచి 2009 వ‌ర‌కు మ‌యూర్‌భంజ్ జిల్లా రాయ్‌రంగ్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌రుపున ఎమ్మెల్యేగా ప‌ని చేశారు.  2013 నుంచి 2015 వ‌ర‌కు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యురాలిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 1997లో ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్ లో బీజేపీ త‌రుపున కౌన్సిల‌ర్‌గా రాజ‌కీయ జీవితం ప్రారంభించారు. అదే ఏడాది మున్సిప‌ల్ వైస్ చైర్‌ప‌ర్స‌న్ అయ్యారు. న‌వీన్ ప‌ట్నాయ‌క్ నేతృత్వంలో సంకీర్ణ ప్ర‌భుత్వంలో ప‌లు మంత్రి ప‌ద‌వుల‌ను నిర్వ‌హించారు. 2002 నుంచి 2009 వ‌ర‌కు మ‌యూర్ భంజ్ బిజేపీ అధ్య‌క్షురాలిగా కొన‌సాగారు. 2004 నుంచి 2009 వ‌ర‌కు రాయ్‌రంగ్‌పూర్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హించారు. 2006 నుంచి 2009 వ‌ర‌కు బీజేపీ రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షురాలుగా కొన‌సాగారు. 2010 నుంచి 2015 వ‌ర‌కు మ‌ళ్లీ బీజేపీ అధ్య‌క్షురాలిగా ఎన్నిక‌య్యారు. 2015 మేలో జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇక ఇప్పుడు ఈమె రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక‌య్యారు.

Advertisement

అయితే ఈమెను రాష్ట్రప‌తిగా 2017లోనే ప్ర‌క‌టించాల‌ని ప‌రిశీల‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ అప్పుడు రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్ర‌క‌టించారు న‌రేంద్ర‌మోడీ. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, ఉప‌రాష్ట్రప‌తి వెంకయ్య‌నాయుడు బీజేపీ కేంద్ర కార్యాల‌యంలో భేటీ కావ‌డంతో ఆయ‌న‌ను ఎన్డీయే త‌రుపున రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా పోటీలో ఉంటార‌ని ఊహ‌గానాలు వినిపించాయి. బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు భేటీ ముగిసిన త‌రువాత ద్రౌప‌ది ఎంపికను ప్ర‌క‌టించారు. దాదాపు 20 మంది పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఎస్టీ మ‌హిళ‌కు భార‌త రాష్ట్రప‌తి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈమె గెలిస్తే తొలి ఆదివాసి మ‌హిళ‌గా చ‌రిత్రలో నిలువ‌నుంది.జులై 18న రాష్ట్రప‌తి ఎన్నిక జ‌రుగ‌నుండ‌గా.. నామినేష‌న్ల దాఖ‌లుకు జూన్ 29 వ‌ర‌కు చివ‌రి గ‌డువు ఉంది.

Also Read : 

ఒకేసారి ఇద్ద‌రినీ పెళ్లాడిన వ్య‌క్తి.. కార‌ణం ఏం చెప్పాడంటే.?

బాల‌కృష్ణ-అనిల్ రావిపూడి సినిమాలో కీల‌క పాత్ర‌లో ఆ సీనియ‌ర్ హీరో..!

 

Visitors Are Also Reading