Home » ఫ్రిజ్ లో ఈ పదార్థాలు పెడితే ఇక అంతే సంగతులు..!

ఫ్రిజ్ లో ఈ పదార్థాలు పెడితే ఇక అంతే సంగతులు..!

by Azhar
Ad
ప్రస్తుతం ఒక్క మనిషి జీవితాల్లో ఫ్రిజ్ అనేది మాములు విషయం అయిపోయింది. ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి ఒక్కరు ఫ్రిజ్ ను వాడేస్తున్నారు. ఇక ఫ్రిజ్ ఉంది కదా.. అని తెచ్చిన ప్రతి వస్తువును.. మిగిలిన ప్రతి వంటకాన్ని అందులో పెట్టి తర్వాత తింటున్నారు. అదే మనం చేసే పెద్ద తప్పు. అయితే మరి ఫ్రిజ్ లో ఏ పదార్ధాలు పెట్టాలి.. ఏవి పెట్టకూడదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..!
మొదటగా అందరూ టమాటాలను ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ అలా చేయకూడదు. అలా చేస్తే ఆ టమాటా అనేది తన సహజత్వాన్ని కోల్పోతుంది. అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే అరటిపండును కూడా మనం ఫ్రిజ్ లో ఉంచకూడదు. ఇలా ఉల్లిగడ్డలను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల.. అవి మెత్తగా అవడం మాత్రమే కాకుండా బూజు పడుతాయి. ఇక ఫ్రై చేసిన వంటకాలను ఫ్రిజ్ లో పెట్టి.. తర్వాత తిన్నట్లైతే మీరు లావుగా ఆయే అవకాశాలు ఉంటాయి.
ఇక చాక్లెట్స్ మరియు తులసి ఆకులను ఫ్రిజ్ లో అసలే పెట్టకూడదు. అలా చేస్తే దాని సహజత్వాన్ని కోల్పోవడం మాత్రమే కాకుండా.. అందులో ఉన్న మిగిత వంటకాల వాసనను తీసుకుంటాయి. అందుకే తులసి ఆకులు నల్లగా అవుతాయి. ఇక ఉడికించిన గుడ్డును కూడా ఫ్రిజ్ లో పెట్ట కూడదు. అలా చేస్తే.. గుడ్డులో పెగ్గులు రావడం మాత్రమే కాకుండా.. గుడ్డు పైన ఉండే తేలని భాగం రబ్బర్ ల అవుతుంది. మరియు లోపల ఫంగస్ అనేది చేరుతుంది. అందువల్ల ఇకనుండి మీరు వీటిని ఫ్రిజ్ లో పెట్టకండి.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading