Home » వాస్తుశాస్త్రం ప్రాకారం ఈ మూడు వ‌స్తువులను ఇంట్లో పెట్టుకోవ‌ద్ద‌ట‌..అవి ఉంటే ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయంటే..?

వాస్తుశాస్త్రం ప్రాకారం ఈ మూడు వ‌స్తువులను ఇంట్లో పెట్టుకోవ‌ద్ద‌ట‌..అవి ఉంటే ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయంటే..?

by AJAY
Ad

హిందువులు వాస్తు ఎక్కువగా విశ్వసిస్తారు. పురాత‌న కాలం నుండి వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇల్లు, ఆఫీసు, వ్యాపార స్థలాలు ఇలా ప్రతి చోటా వాస్తు ప్రకారం నడుచుకుంటారు. వాస్తు స‌రిగా లేక‌పోతే ఆర్థిక‌ సమస్యలు, అనారోగ్య‌ సమస్యలు, మాన‌సిక‌ సమస్యలు వ‌స్తాయ‌ని చెబుతుంటారు. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఆ వస్తువులు ఏంటి..? అవి ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది..? అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం… ఇంటిలో మహాభారత యుద్ధానికి సంబంధించిన ఫోటోలను, పోస్టర్లను పెట్టుకోకూడదట. కొంతమంది డెకరేషన్ కోసం అలాంటి ఫోటోలను ఇంటిలో పెట్టుకుంటారు. కానీ వాటిని పెట్టుకోవడం ద్వారా కుటుంబంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Advertisement

అంతేకాకుండా ఇంట్లో పనిచేయని గడియారాన్ని సైతం అస్సలు పెట్టుకోకూడదట. దానివల్ల కూడా కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది సరదా కోసం.. మరి కొంతమంది అందంగా కనిపించడం కోసం ఇంటిలో అక్వేరియంను పెట్టుకుంటారు.

Young couple arguing

అక్వేరియం అంటే చేప‌ల‌ను నీటిలో పెంచే తొట్టి… అందులో ఉండే రంగు రంగు రాళ్ల వల్ల ఇంట్లో య‌జమానికి క‌ష్లాలు త‌ప్ప‌వ‌ట‌. ఇంట్లో అక్వేరియంలో ఉంటే మానసిక సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కేవలం ఇళ్లలోనే కాకుండా ఆఫీసుల్లోనూ అక్వేరియంల‌ను పెట్టుకోవద్దని చెబుతున్నారు. .

Visitors Are Also Reading