హిందూ ధర్మంలో పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆరోజున, స్నాన, దానాలు, తర్పణాలు, సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టడాలు చేయాలని చెప్పబడింది. ఈ ఏడాది పౌర్ణమి వచ్చే రోజులలో భద్ర నీడ ఉంది. అందుకే ఈ ఏడాది రక్షా బంధన్ ను ఆగస్టు 30, ఆగస్టు 31 తేదీల్లో జరుపుకోవాలి. ఆగస్టు 30న ఉదయం 10.12 గంటల నుంచి ఆగస్టు 31న ఉదయం 7.45 గంటల వరకు ఉంది. అయితే, ఆగస్టు 30న రాత్రి 8:58 వరకు భద్ర నీడ ఉంది. అందుకే రాఖీని ఆగస్టు 31న ఉదయం 7.45 గంటల సమయంలోపు జరుపుకోవాలి.
Advertisement
భద్ర నీడ సమయంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు. ఇంకా, రాఖి కట్టే విషయంలో కొన్ని నియమాలను తెలుసుకుని పాటించాలి. రాఖీ కట్టే సమయంలో సోదరుడి ముఖం తూర్పు దిశలోను, సోదరి ముఖం పడమర లేదా ఉత్తరం దిశలోను ఉండాలి. రాఖి కట్టే సమయంలో ఎవరి ముఖానికైనా దక్షిణం ఎదురుగా ఉండకూడదు. అది అశుభమైనదిగా పరిగణించబడుతుంది.
Advertisement
రాఖీని ఎక్కువ రోజుల పాటు చేతికే ఉంచుకుంటే అపవిత్రం అవుతుంది. కొన్ని రోజుల తరువాత మంచి రోజుని చూసుకుని రాఖీని తొలగించాలి. తొలగించిన రాఖీని ఎక్కడబడితే అక్కడ పడేయకూడదు. ఓ ఎర్రని వస్త్రంలో చుట్టి దేవుని మందిరంలో ఉంచండి. విరిగిపోయిన లేదా తెగిపోయిన రాఖీలను చేతిలో ఉంచకూడదు. అటువంటి రాఖీలను చేతికి ఉంచుకుంటే సోదరులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలా విరిగిపోయిన రాఖీలను ఎక్కడబడితే అక్కడ పడవేయకుండా.. ప్రవహించే నీటిలో పడవేయాలి. రాఖి కట్టుకునే సమయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి.
మరిన్ని..
హీరో అఖిల్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న శ్రియ భూపాల్… ఇప్పుడు లగ్జరీ లైఫ్ ఎంజాయ్…!
విజయ్కి మిడ్ నైట్ వీడియో కాల్ చేసిన సమంత.. ఏమైంది?
ఆలీ చేసిన సూపర్ హిట్ మూవీని వదలుకున్న మహేష్ బాబు ?