Home » పెళ్లి తరువాత పిల్లల విషయంలో ఆలస్యం చేస్తే వచ్చే 5 సమస్యలు ఇవేనని తెలుసా…?

పెళ్లి తరువాత పిల్లల విషయంలో ఆలస్యం చేస్తే వచ్చే 5 సమస్యలు ఇవేనని తెలుసా…?

by AJAY

ఒకప్పుడు పెళ్లైన వెంటనే భార్యా భర్తలు పిల్లలను కనేందుకు ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి చేసుకుని కొద్ది రోజులు ఇద్దరే కలిసి లైఫ్ ను ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. కనీసం ఒక ఏడాది కానిదే పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు. మరి కొందరు అయితే రెండు మూడేళ్లు ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు అదొక పాషన్ అయిపోయింది.

అయితే పెళ్ళైన తరవాత పిల్లల కోసం ప్లాన్ లు చేసుకోకుండా సాధారణంగా గర్భం ఎప్పుడు వస్తే అప్పుడే పిల్లలను కనాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పెళ్లి తరవాత కొంతమంది ప్రెగ్నెన్సీ ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి టాబ్లెట్స్ ను వాడుతుంటారు. అయితే అలా టాబ్లెట్ లు వాడటం వల్ల గర్భానికి సంబంధించిన సమస్యలు వచ్చి పూర్తిగా అసలు పిల్లలు పుట్టకుండా పోయే అవకాశం కూడా ఉందట.

 

అంతే కాకుండా అసలే ఇప్పుడు పెళ్లిళ్లు ముప్పై దాటిన తరావత చేసుకుంటున్నారు. ఇంకా లేట్ అయితే వయసు పెరిగి అండం, శుక్రకణాల ఉత్పత్తిలో వచ్చే మార్పుల వల్ల పిల్లలు పుట్టక పోయే అవకాశం ఉందట. మరోవైపు భార్య భర్తలు సరైన వయసులో ఉన్నప్పుడు పిల్లలను కంటే వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. అదే ఆలస్యం అయితే పుట్టే పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందట.

పెళ్లి తరవాత పిల్లలను కనేందుకు కావాలని సమయం తీసుకుంటే చుట్టు పక్కల వాళ్ళు అనే మాటలతో మానసికంగా కుంగి పోయే అవకాశం ఉందట. కాబట్టి భార్యా భర్తలు పెళ్లి తరవాత పిల్లలు ఎప్పుడు కలిగితే అప్పుడే కనాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఎంజాయ్ కోసమో కెరీర్ కోసమో వాయిదా వేస్తూ పోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Also read : “దేవి పుత్రుడు” చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా…!

Visitors Are Also Reading