Home » 30 దాటిన వాళ్ళు ఈ పనులు చేయకూడదట…చేస్తే ఏం జరుగుతుందంటే…?

30 దాటిన వాళ్ళు ఈ పనులు చేయకూడదట…చేస్తే ఏం జరుగుతుందంటే…?

by AJAY
Ad

వ‌య‌సు పెరిగినా కొద్ది అనారోగ్యం వ‌చ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది. కాబ‌ట్టి ఏజ్ పెరిగిన‌కొద్దీ దానికి త‌గిన‌ట్టుగా జాగ్ర‌త్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ముప్పై దాటిన త‌ర‌వాత‌నే జాగ్ర‌త్త‌లు పాటించ‌డం మొద‌లు పెడితే ఆ త‌ర‌వాత కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. కాబ‌ట్టి ముందే జాగ్ర‌త్త ప‌డటం మంచిది. ఆరోగ్యం అంటే శారీర‌క ఆరోగ్యంతో పాటూ మానసిక ఆరోగ్యం మరియు అందం కూడా. ముఖ్యంగా 40 ఏళ్లు ప‌డిన త‌వ‌రాత ఏజ్ పెరుగుతుంద‌నే భావ‌న ప్ర‌తిఒక్క‌రికీ క‌లుగుతుంది.

Advertisement

ఆ వ‌యసు వ‌చ్చిన త‌ర‌వాత ముఖం పై ముడత‌లు ప‌డ‌టం కూడా మొద‌ల‌వుతుంది. అయితే కొన్ని జాగ్ర‌త్త‌లు ప‌డ‌టం వ‌ల్ల ఎక్కువ కాలం అందంగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జుట్టు చ‌ర్మం పై కూడా శ్ర‌ద్ద తీసుకోవాలి. అయితే జ‌రిగేదాన్ని ఆప‌లేం కాబ‌ట్టి వ‌య‌సు పెరుగుతున్న క్ర‌మంలో వ‌చ్చే ముడ‌త‌లు మరియు జుట్టు రాల‌డం లాంటి వాటి గురించి బెంగ పెట్టుకోవ‌ద్ద‌ని మాన‌సిక నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

అలా బెంగ పెట్టుకోవ‌డం వ‌ల్ల ఇంకా ఎక్కుడ న‌ష్టం జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. ఒక‌ప్పుడు యాబై ఏళ్లు వ‌చ్చిన త‌ర‌వాత ముఖం పై మ‌డ‌తలు ప‌డ‌టం వెంట్రుక‌లు తెల్ల‌బ‌డ‌టం లాంటివి జ‌రిగేవి కానీ ఇప్పుడు ముప్పై దాట‌గానే మొద‌ల‌వుతున్నాయి. ఇక వ‌య‌సు పై బ‌డుతున్న క్ర‌మంలో కొత్త‌గా ఏదో ఒక‌టి నేర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాల‌ట‌.

ఉద్యోగం కోస‌మో వ్యాపారం పైన అయినా దృష్టి పెట్టాల‌ట‌. అందం గురించి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి కానీ బెంగ పెట్టుకోకూడ‌ద‌ని చెబుతున్నారు. పుస్త‌కాలు చ‌దవ‌డం వ‌ల్ల మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటుంద‌ని కాబ‌ట్టి పుస్త‌కాలు చ‌ద‌వ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని చెబుతున్నారు. అంతే కాకుండా వేషాదార‌ణ కూడా యంగ్ గా క‌నిపించేలా ఉండాలని దానివ‌ల్ల మాన‌సికంగా కృంగిపోయే అవ‌కాశం లేద‌ని సూచిస్తున్నారు.

Visitors Are Also Reading